CM Chandrababu Approves BT Works On Tirumala Ghat Roads : తిరుమల మొదటి, రెండు ఘాట్‌రోడ్లలో బీటీ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇటీవల ఒంటిమిట్ట కోదండ రామాలయ ఉత్సవానికి హాజరైన ఆయన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుతో సమావేశమైన విషయం తెలిసిందే.
"తిరుమల రెండు ఘాట్‌రోడ్లు వైఎస్సార్సీపీ హయాంలో గుంతలమయం అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. పూర్తిస్థాయిలో రోడ్లను వేయాల్సిన అవసరం ఉంది’’ అని టీటీడీ ఛైర్మన్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొదటి ఘాట్‌రోడ్డు 19 కి.మీ, రెండో ఘాట్‌రోడ్డు 18 కి.మీ. పొడవు ఉంటాయి. దాదాపు రూ.12 కోట్లతో రెండు ఘాట్‌రోడ్లలో తారు పనులు చేపట్టనున్నారు.
అయితే తిరుమలను ప్రపంచంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047కు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుమల వచ్చే భక్తులు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుని, భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేపట్టింది. గత వైఎస్సార్సీపీ పాలనలో సాధారణ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన అధికారులు గణనీయమైన మార్పులు చేశారు. దర్శనాల సంఖ్య పెంచడంతో పాటు, సౌకర్యాలను మెరుగుపరిచారు.
తిరుమల అన్నప్రసాదంలో మసాల వడ - ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగుల సంచారం - భయాందోళనలో భక్తులు