ETV Bharat / state

మొబైల్‌ ఫోన్‌కు అతుక్కుపోతున్న పిల్లలు! - ఏం జరుగుతుందో తెలుసా? - CHILDREN ARE STUCK ON MOBILE PHONES

నిద్రలేస్తూనే తల్లిదండ్రులను మొబైల్‌ అడుగుతున్న చిన్నపిల్లలు - ఏడాదిలోపే మొబైల్‌ని వినియోగిస్తున్న పరిస్థితి - ఫోన్‌ ఇవ్వకుంటే మారాంచేస్తున్న చిన్నారులు - మరో దారిలేక మొబైల్ చేతికిస్తున్న తల్లిదండ్రులు

Mobile Phones
Mobile Phones Impact On Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2025 at 4:48 PM IST

Updated : June 5, 2025 at 2:22 PM IST

6 Min Read

Mobile Phones Impact On Children : నేటితరం పిల్లలు నిద్రలేస్తూనే మొబైల్‌ ఫోన్‌లో ముఖం పెడుతున్నారు. ఒక నిర్ణీత సమయమంటూ లేకుండా గంటల తరబడి చరవాణిలోనే గడిపేస్తున్నారు. వాట్సాప్, యూట్యూబ్‌, ఇన్‌స్టా ఇలా అనేక సోషల్‌ మీడియా ప్లాట్​ఫాంలలో వేళ్లరిగేలా స్క్రీన్‌ని స్క్రోల్‌ చేస్తున్నారు. రాత్రి పన్నెండు దాటినా కళ్లలో ఒత్తులేసుకుని మరీ మొబైల్​లో చాటింగ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ చెప్పుచేతల్లో పిల్లల చదువు, భవిష్యత్​ చిక్కిపోతోంది.

సమస్యలు ఏంటి? : అయితే, ఆ మొబైల్ భూతం క్రమంగా చిన్నపిల్లలకు అంటుకుంటుంది. నెలల వయసున్న చిన్నారులు సైతం మొబైల్ ఫోన్​కు అలవాటు పడుతున్నారు. పాలు తాగాలన్నా, ఏడుపు ఆపాలన్నా, కుదురుగా ఉండలన్నా వీటన్నింటికీ చరవాణే సమాధానంగా తల్లిదండ్రులకు కనిపిస్తోంది. మరి, పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఫోన్లు చిన్న పిల్లలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారు.

Mobile Phones Impact On Children
మొబైల్‌ ఫోన్‌కు అతుక్కుపోతున్న పిల్లలు! - ఏం జరుగుతుందో తెలుసా? (ETV Bharat)

20వ శతాబ్దంలో మనిషి అరచేతికి మొలకెత్తిన ఆరో వేలే మొబైల్‌ ఫోన్‌. ప్రస్తుతం అందరికీ ఫోనే ప్రపంచమైంది. సాంబర్‌, పప్పు, కర్రీ వంటివి లేకపోయిన అన్నం తింటారేమో కానీ, మొబైల్ ముందు లేకపోతే ముద్ద దిగదు అన్నచందంగా తయారైంది పరిస్థితి. అరచేతిలోనే ప్రపంచాన్ని కళ్ల ముందు చూపిస్తూ అందర్నీ తన ఆధీనంలో పెట్టుకుంటోంది మొబైల్‌ ఫోన్​.

చిన్నప్పుడే అడిక్షన్‌గా : 3 పూటల అన్నం లేకపోయిన ఉండగలమేమో కానీ, 3 నిమిషాలు చరవాణి లేకపోతే ఉండలేకపోతున్నారు నేటితరం. కనీసం పూర్తిగా ఛార్జింగ్‌ అయ్యే సమయం కూడా ఆగట్లేదు. కరోనా విజృంభన, సోషల్ మీడియా యాప్స్ ప్రభావంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే మొబైల్‌ ఫోన్ వ్యసనం చేస్తున్న నిర్వాకం అంతా ఇంతా కాదు. అది పిల్లలకు చిన్నప్పుడే అడిక్షన్‌గా మారితే పరిస్థితి ఏంటనేది ఊహకందని సమాధానం.

ముక్కు పచ్చలారని మూడేళ్ల పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరికీ ఓ ఆటవిడుపు కాలక్షేప వస్తువులా మారింది మొబైల్‌. సోషల్ మీడియా రాకతో చరవాణి వినియోగం తారాస్థాయికి చేరింది. స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఆటలు ఆడుకోవాల్సిన పిల్లలు ఫోన్‌ ఇవ్వాలని ఒకటే మారాం చేస్తున్నారు. లేకుంటే ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేస్తున్నారు.

సృజనాత్మక శక్తి క్రమంగా : అయితే, అతి ఏదైనా అనర్థమే అన్నట్లు అవసరానికి వాడుకోవాల్సిన ఫోన్లు పసి పిల్లల భవిష్యత్తును చిక్కుల్లో పడేస్తు న్నాయి. వేళ్లు అరిగేలా, కళ్లు ఉబ్బేలా రీల్స్ చూస్తున్న చిన్నారుల్లో సృజనాత్మక శక్తి క్రమంగా క్షీణిస్తోంది. వారిలో డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయి ఆలోచనా శక్తి మందగిస్తోంది. అంతేనా, గంటల తరబడి మొబైల్‌లో గడుపుతూ ఆటపాటలు, మానవ సంబంధాలకు దూరమై చిన్ననాటి నుంచే మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు.

చరవాణి చూస్తూనే రోజంతా గడుపు తున్నారు. ఆహారం, ఆటవిడుపు, ఆహ్లాదం అన్నీ ఫోన్‌లోనే. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్లు చేసే మారాం మామూలుగా ఉండదు. తల్లిదండ్రులకు మరోదారి లేక ఫోన్‌ చిన్నారులు చేతికి ఇస్తున్నారు. దీంతో ఆలోచనా శక్తి మందగించడం సహా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చక్కగా తోటి వారితో ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యం ఆన్​లైన్ ఎరలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

వయసుతో సంబంధం లేకుండా : పిల్లలే కాదు యువత కూడా గంటల తరబడి మొబైల్ ఫోన్లలో తలమునకలు అవుతున్నారు. చాటింగ్, రీల్స్‌తో సమయం వృథా చేసుకోవడంతో పాటు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెద్దవాళ్లు కూడా క్రమంగా చరవాణి చెరలో చిక్కుకుంటున్నారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ ఫోన్‌కి బానిసలుగా మారుతున్నారు.

మొబైల్‌ రాకతో మానవ సంబంధాల కంటే డిజిటల్ బంధాలకు అధిక ప్రాధాన్యత సంతరిం చుకుంది. కుటుంబసభ్యులు ఎవరి ఫోన్లో వారు బిజీగా ఉండిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. దీంతో బంధాలు, బంధుత్వాలకు మధ్య అంతరం పెరిగిపోయింది. సమాచార మార్పిడి సాధనంగా వచ్చిన స్మార్ట్ ఫోన్ మానవ సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఆన్‌లైన్‌ తరగతుల పుణ్యమా అంటూ ఫోన్‌ అందరికీ చేరువైంది. 8 ఏళ్లు వచ్చేసరికి చాలా మంది చేతుల్లో చరవాణులు ఉన్నట్లు నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్టింగ్ చైల్డ్ రైట్స్ గణాంకాలు చెబుతు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం పిల్లలు 2గంటలకు మించి మొబైల్ చూడకూడదు. కానీ, వాస్తవ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

డిజిటల్ అడిక్షన్‌కు : ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఎంతో అమూల్యమైంది. మొబైల్ ఆ చిన్నారి బాల్యాన్ని పూర్తిగా ఆక్రమిస్తోంది. పసిపిల్లల్ని కాసేపు కుదురుగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఫోన్ అలవాటు చేస్తున్నారు. క్రమంగా ఇది డిజిటల్ అడిక్షన్‌కు దారితీస్తూ పసిపిల్లల పాలిట పాశంగా మారుతోంది. 40 శాతం పిల్లలు తమ సొంత మొబైళ్లు కలిగి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు కోసం మొదలైన ఫోన్ వాడకం నానాటికి పెరుగుతూ తీవ్ర రూపం దాల్చింది.

సమయం తో సంబంధం లేకుండా ఫోన్‌కు బానిసలుగా మారుతున్నవారు లెక్కకుమిక్కిలి. లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొబైల్‌తోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఫలితంగా ఒత్తిడి, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం వంటివి జరుగుతున్నాయి. మానవ సంబంధాల నిర్వహణ సరిగా లేక చిన్న సమస్యలకే కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కన్ను పొడిబారటం, చిన్నవయసులో దృష్టి లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే, గంటల తరబడి కూర్చుని ఉండటం, వీడియోలు చూస్తూ పరిమితికి మించి తినడం వల్ల ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది" -శృతి, కంటి వైద్యురాలు జీవీకే హెల్త్ హబ్

వైద్య నిపుణుల సూచనల మేరకు 5 సంవత్సరాల వరకు ఫోన్‌ చూడొద్దు. 5 నుంచి 10ఏళ్ల పిల్లలు కేవలం గంటసేపు మాత్రమే చూడాలి. 15 నుంచి 20 ఏళ్ల పిల్లలు 2గంటలు మించోద్దు. ఆపై వయసు గలవారు 4 గంటలకు మించి మొబైల్ స్క్రీన్ చూడోద్దని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా తప్పనిసరి, అత్యవసరం అయితే మొబైల్ వినియోగించాలని చెబుతున్నారు.

నరాలపై ప్రభావం : ఎక్కువ సమయం ఫోన్ పట్టుకోవటం వల్ల చిటికెన వేలుపై బరువు పడి పింకీ ట్రిగ్గర్, పింకీ ఫింగర్, ఫోన్ పింకీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ వినటానికి వింతగా అనిపించినా ప్రస్తుతం ఎవ్వరికీ తెలియకుండా అందరినీ వేదిస్తున్న సమస్యలు. గంటల తరబడి ఫోన్ బ్యాలెన్స్ చేయటం వల్ల నరాలపై ప్రభావం చూపుతోంది. కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీసే అవకాశం ఉంది. అలాగే, ఎక్కువ సేపు ఫోన్లో తలపెట్టడం వల్ల మెడ కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

"చిన్న వయసులోనే పిల్లలు డిజిటల్ అడిక్షన్‌కు గురై చదువులో వెనకబడుతున్నారు. వారి కోసం ప్రభుత్వం విద్యాలయాల్లో డిజిటల్ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఎన్జీవోలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నాయి. మరికొందరు ప్రత్యేక యాప్స్‌ రూపొందించి చిన్నారులకు ఫోన్‌ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు" -విజయ్ భాస్కర్, వైద్యులు

అంధకారంలోకి : మొబైల్​ ఫోన్​ను జాగ్రత్తగా వాడుకుంటే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. లేదంటే ప్రాణాల మీదకూ వస్తుంది. కనుక మొబైల్ ఫోన్లను పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. అవసరం మేరకే వినియోగించేలా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారై చిన్నారుల బాల్యం చరవాణుల్లో చిక్కుకుని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది.

అశ్లీల వీడియోలకు బానిసలవుతున్న పిల్లలు - లేత మనసుపై తీవ్ర దుష్ప్రభావాలు

మీ పిల్లలు ఫోన్​కు అడిక్ట్​ అయ్యారా? ఈ 6 చిట్కాలు ఫాలో అయితే అంతా సెట్​! - How To Stop Child Phone Addiction

Last Updated : June 5, 2025 at 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.