ETV Bharat / state

భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుంది : సీఎం రేవంత్‌ రెడ్డి - CM REVANTH REDDY ON BHUBHARATHI

భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష - సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతి ఉండాలన్న ముఖ్యమంత్రి - భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుందని విశ్వాసం

REVANTH REVIEW BHU BHARATHI
CM REVANTH REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 13, 2025 at 5:50 PM IST

1 Min Read

CM Revanth Reddy Review on Bhu Bharathi Portal : తెలంగాణ రాష్ట్రంలో పైలట్​ ప్రాజెక్టుగా మూడు మండలాల్లో అమలుచేయనున్న భూభారతి పోర్టల్​పై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు భూభార‌తి పోర్టల్‌ సోమవారం జాతికి అంకితమివ్వనున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్​ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుందని ఆకాంక్షించారు.

అత్యాధునికంగా భూభారతి : అత్యాధునికంగా భూభారతి వెబ్‌సైట్ ఉండాలని, భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. భూభారతి నిర్వహణను మంచి విశ్వసనీయత కల్గిన సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, సీఎం ఓఎస్‌డీ, రెవెన్యూశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఎన్నికలకు భూభారతి రెఫరెండం : సోమవారం రోజున ముందుగా 3 మండలాల్లో పైల‌ట్‌గా భూభారతి అమలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి అమ‌లవుతుందని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు భూభారతి రిఫ‌రెండం అవుతుందని అన్నారు. మే నెల మొద‌టివారంలో గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల నియామకం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

వారికే ఇళ్లు కేటాయించండి - ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రేపే 'భూభారతి' పోర్టల్​ ప్రారంభం - తొలుత 3 మండలాల్లో అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.