Gaddam Vivek : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు ఎట్టకేలకు మంత్రి పదవి వచ్చింది. స్థానిక కాంగ్రెస్ నేతలతో సయోధ్య లేదని వార్తలు వచ్చినప్పటికీ వివేక్‌కు అమాత్యయోగం వరించింది. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వివేక్, 2009లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్, బీజేపీలలోకి మారారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా మంత్రి బెర్తును ఖరారు చేసుకున్నారు.
వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకట స్వామి, సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలోనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013 జూన్‌లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. సరిగ్గా ఎన్నికల సమయంలో 2014లో టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ 2016లో తిరిగి గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్లో చురుగ్గా కొనసాగిన వివేక్ 2019లో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా, దక్కకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
2023లో హఠాత్తుగా కాంగ్రెస్‌లోకి : 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన గడ్డం వివేక్, క్రీయాశీలక నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతలు నిర్వర్తించారు. పెద్దపల్లి నుంచి వివేక్ బీజేపీ తరఫున పోటీ చేస్తారని భావించినప్పటికీ 2023లో హఠాత్తుగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్‌ను ప్రభుత్వం తాజాగా మంత్రివర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు సహా పలువురు కాంగ్రెస్ నేతలకు, వివేక్‌కు మధ్య సయోధ్య లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. సరస్వతీ పుష్కరాల ప్రారంభోత్సవంలోనూ స్థానిక ఎంపీ గడ్డం వంశీని పిలవకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనూహ్యంగా కేబినెట్‌లో వివేక్ బెర్త్ ఖరారవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివేక్ వెంకట్ స్వామి రాజకీయ ప్రస్థానం :
- వివేక్ వెంకటస్వామి ప్రముఖ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి కుమారుడు
- తండ్రి జి.వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వివేక్ ప్రవేశం
- 2009లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ వెంకటస్వామి
- తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో బీఆర్ఎస్లో చేరిన వివేక్
- 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరిక
- పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వివేక్
- 2016లో మళ్లీ బీఆర్ఎస్లో చేరిన వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో 2019లో ఎన్నికలకు దూరం
- 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామి
- 2023లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్
- 2024లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ కుమారుడు వంశీ
Ex MP Vivek Joins Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్