Bandi Sanjay on Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిందే తాను అని గుర్తు చేశారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు చాలా మంది జీవితాలు నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు.
ఎందుకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు : పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారని బండి సంజయ్ తెలిపారు. ఈ స్టేట్మెంట్ను అనుసరించి కేసీఆర్, కేటీఆర్‌కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసలీ వ్యవహారం వెనక వీరిద్దరు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎంవోను అడ్డాగా చేసుకుని ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే పేపర్ లీక్ కేసులో తనను అరెస్టు చేశారన్నారు.
"నేను మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపిస్తూనే ఉన్నాను. హైదరాదాద్, సిరిసిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ప్రణీత్ రావు తప్పించుకున్నాడు. ఆయన వల్ల ఎంతోమంది కార్యకర్తల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావు, రాధాకిషన్ అనేక పార్టీల కార్యకర్తల జీవితాలతో ఆడుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు." - బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్‌రావు అండ్ కోను కాపాడే ప్రయత్నాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చే ముందు కేటీఆర్ అమెరికాకు వెళ్లడం వెనక ఏదో మతలబు ఉందన్నారు. అమెరికాలో ప్రభాకర్‌రావుతో కేటీఆర్ మాట్లాడిన తర్వాతే భారత్‌కు వచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు టీమ్ బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో, తనకు కూడా సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. త్వరలో సిట్ అధికారులు వచ్చి విచారణ చేస్తారని ఆయన చెప్పారు.
బండి సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లూ ట్యాప్!
గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ - తెలంగాణలో గ్రీన్ మర్డర్ : బండి సంజయ్