CM Chandra Babu Delhi Tour Updates : అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు జరగనున్న ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఢిల్లీలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల శక్తి మంత్రి సి. ఆర్. పాటిల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర పరిస్థితులపై దిల్లీ పెద్దలతో చర్చలు: రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు, ఇతర సాయం పై అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల గురించి చర్చించనున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్ధ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం పై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మిర్చి రైతుల సమస్యలపై సీఎం మాట్లాడనున్నారు. మిర్చి ధర పతనంతో కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు లేఖలు రాశారు. అనంతరం ఈ నెల 20వ తేదీ రాత్రికి సీఎం తిరిగి అమరావతి చేరుకోనున్నారు.