Case Filed Against Hero Bellamkonda Srinivas : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందినందుకు హీరోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గురువారం పోలీసులు విచారణకు హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరుకావాలని హీరోకు పోలీసులు సూచించారు. నటుడి కారును సీజ్ చేసి, నోటీసులు ఇచ్చి పంపించారు.

జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బెల్లంకొండను అడ్డుకున్నాడు. హీరో ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుస్తుగా ప్రవర్తించడమే కాగా అతనిపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కానిస్టేబుల్ హీరోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనివాస్‌ని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నోటీస్ జారీచేసి కారు సీజ్ చేశారు.
Case On Bellamkonda: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు..