Car Accident In Nandyal District: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్లో డ్రైవింగ్ స్కూల్ కారు బీభత్సం సృష్టించింది. టీ తాగుతున్న వారిపైకి అమాంతం కారు దూసుకెళ్లింది. దాంతో అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఓ వ్యక్తి డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తున్నాడు. అందులో భాగంగా ఓ యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
డోన్ పట్టణ సమీపంలో పాత బస్టాండ్లోని చలం టీ స్టాల్ వద్ద ముగ్గురూ వ్యక్తులు టీ తాగుతున్నారు. కారు అతివేగంగా వచ్చి వారిపైకి దూసుకెళ్లింది. ముగ్గురు వ్యక్తులను దగ్గర్లో ఉన్న మూడు ద్వి చక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి అక్కడికక్కడే గాయాలవ్వగా వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలుకు తరలించారు. అనుమతులు లేని డ్రైవింగ్ స్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదం - హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి