ETV Bharat / state

చదువుకోవడానికి కెనడా వెళ్లాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

కెనడాలో విద్యార్థులకు తగ్గిన ఉద్యోగావకాశాలు - మరోవైపు 25 శాతం పెరిగిన ట్యూషన్‌ ఫీజులు - ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులు

STUDENTS FACING PROBLEMS IN CANADA
Canada Education Students Facing Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 11:59 AM IST

Canada Education Students Facing Problems : అమెరికాకు చదువుకోవడానికి వెళ్దామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉంది. ఫీజులూ ఎక్కువే ఉన్నాయి. ఎక్కువ మంది ఆ దేశానికే వెళ్తుండటంతో అందరికీ ఉద్యోగాలూ దొరకని పరిస్థితి. కెనడాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం వీసాలు వస్తున్నాయి. చదువుకుంటూనే అధికారికంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోవడానికి వీలుంది. యూఎస్‌ఏతో పోల్చుకుంటే ఇక్కడ 30 శాతం ఫీజులు తక్కువ. ఏడాదిలోనే చదువు పూర్తి చేయవచ్చు. ఇక పర్మనెంట్‌ రెసిడెన్స్‌(పీఆర్‌) ఒకటి రెండురోజుల్లోనే వస్తుంది.

దీంతో 2021 నుంచి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఆ దేశానికి వెళ్లారు. జీవన వ్యయం భారీగా పెరగడం ఉద్యోగాలు దొరకకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. కెరీర్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చన్న ఆశతో కెనడా వెళ్లిన విద్యార్థులు ఉద్యోగాలు వచ్చి తమ కష్టాలు ఎప్పుడు తీరతాయా? అని ఎదురుచూస్తున్నారు.

విద్యార్థులకు తగ్గిన ఉద్యోగావకాశాలు : అమెరికా నుంచి భారతీయ విద్యార్థులతో పాటు మొత్తం 14 దేశాల వారిని తమ దేశానికి రప్పించుకునే ఉద్దేశంతో త్వరితగతిన స్టడీ వీసాలు ఇచ్చేందుకు స్టూడెంట్‌ డైరెక్ట్‌ స్ట్రీమ్‌(ఎస్‌డీఎస్‌) పథకాన్ని కెనడా 2018లో ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇలా దరఖాస్తు చేయడంతో అలా వీసా వచ్చి భారీ సంఖ్యలో కెనడాకు వెళ్లారు. తాజాగా ఈ పథకాన్ని కెనడా రద్దు చేసింది.

ట్యూషన్‌ ఫీజులు 25 శాతం పెంపు : దీంతో కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు రెగ్యులర్‌ స్టడీ పర్మిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాల జారీ కూడా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజులను దాదాపు 25 శాతం పెంచాయి. భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు సున్నితంగా మారడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో చదువుకోవడానికి కెనడా వెళ్లాలనుకునే వారు ఇతర దేశాల వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. 2025 జనవరిలో ప్రారంభమయ్యే ఫాల్‌ సీజన్‌లో ప్రవేశాలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

32 శాతం మంది కెనడాలోనే : ఈ సంవత్సరం (2024) జూలై నాటికి ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.35 లక్షలు. 2019లో ఆ సంఖ్య 6.75 లక్షలు కాగా 2024 జులై నాటికి దాదాపు రెట్టింపు అయ్యింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టులో పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికంగా 4.27 లక్షల మంది అంటే సుమారు 32 శాతం కెనడాలో ఉన్నారు.3.37 లక్షల మంది అమెరికాలో, 1.85 లక్షల మంది యూకేలో, 1.22 లక్షల మంది ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.

"గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్తున్నారు. గత సంవత్సరం నివాసానికి ఇళ్లు కూడా దొరకని పరిస్థితి. దానికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల చాలా ధరలు పెరిగాయి. జీవన వ్యయం పెరిగింది. జాబ్‌ మార్కెట్‌ బాగా డీలాపడింది. ఒక చిన్న గదిలో ఇద్దరు, ముగ్గురికి మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. డిమాండ్‌ ఏర్పడి ఇళ్ల అద్దెలు పెరిగాయి." -జి.అమర్‌నాథ్, మాంట్రియల్‌లో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ వాసి

ఫారిన్​లో చదువుకునేందుకు వెళ్తున్నారా? మీ 'బడ్జెట్' ప్లాన్ ను ఇలా వేసుకుంటే అంతా సాఫీగా! - Foreign Students Budget Plan

ఫారిన్ వెళ్లి చదువుకునే వారికి గుడ్​న్యూస్ - డబుల్ కానున్న స్కాలర్​షిప్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.