BRS Vinod Kumar about Central Funds to Telangana : విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమేనని తెలంగాణకు కూడా ఇవ్వాల్సినవి తప్పక ఇవ్వాలని తెలిపారు. కేంద్రంలో చంద్రబాబుపై ఆధారపడ్డందుకు, ఏపీకి మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు.
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. టీడీపీతో అవసరం లేకుంటే ఏపీకి కూడా కేంద్రం ఏదీ ఇచ్చేది కాదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీకి మంచి ఎంపీ సీట్లు రావటం వల్ల డిమాండ్లు సాధించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపటంపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరు విప్పాలని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు స్పందించటం లేదని మండిపడ్డారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అంశం ఒక్కటీ లేదని తెలిపారు.
ఎన్నికలు, రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి వైపు ఆలోచించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమని గతంలో బీఆర్ఎస్కు వచ్చారని ఇప్పుడు పోతున్నారని తెలిపారు. తెలంగాణను అన్ని విదాలా అభివృద్ధి చేసామని ఐదేళ్ల తర్వాత ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో కొత్త నాయకులను తయారు చేస్తామని అన్నారు. శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ చురుకైన పాత్ర నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
"రైల్వే కోచ్ ప్యాక్టరీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. వచ్చే రోజుల్లో కొత్త నాయకులను తయారు చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం దురదృష్టకరం. శాసన సభ సమావేశాల్లో మా పార్టీ చురుకైన పాత్ర నిర్వహిస్తుంది." -వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు
కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery