ETV Bharat / state

పితృదేవతలకు - అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? - Pitru Devatas and Amavasya Relation

Story on Pitru Devatas and Amavasya Relation : ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమని పెద్దలు అంటుంటారు. అందుకే ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతుంటారు. అసలు పితృ దేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటి? అసలు అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాన్ని తెలుసుకుందాం రండి.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 6:43 PM IST

STORY ON PITRU DEVATAS
Story on Pitru Devatas and Amavasya Relation (ETV Bharat)

Brief Explanation on Pitru Devatas and Amavasya Relation : పితృ దేవతల్ని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి, ప్రశ్నలకు సమాధానమిస్తుంది ఈ కథ సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. మరి పితృదేవతలకూ, ఈ అమావాస్యకూ ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవ గణాలు ఎన్ని, అవి ఎలా ఉంటాయి? అసలు అమావాస్య ఎలా ఉద్భవించింది? ఈ విషయాల్ని చెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.

పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారు. వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనే వారికి ఆకారం ఉండకపోవడం విశేషం. హవిష్మంతులు, సుఖాలినులు, సోమపులు, ఆజ్యవులు అనే నాలుగు గుణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడు గుణాల వారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే పితృదేవతలకు కావాల్సిన శ్రాద్ధ విధుల్ని నిర్వహించాలని అంటుంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారట.

పితృదేవతలుగా ఎలా మారారంటే? : పితృగణాల వారు శాశ్వతాలైన లోకాల్ని పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. ఏకాగ్రత లోపించడంతో యోగభ్రష్టులయ్యారు. భ్రష్టులైన కారణంగా వారంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఆమె హిమవంతుడిని పెళ్లి చేసుకుంది. వీరికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. మైనాకుడి కుమారుడు క్రౌంచుడు పేరు మీదనే క్రౌంచ ద్వీపం ఏర్పడింది.

మేనా హిమవంతులకు ఉమ, ఏకపర్ణ, అపర్ణ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురు కుమార్తెలైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. అలా వైరాజు పితృదేవతల సంతతి చెందింది. సోమపథాలు లోకాల్లో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు ఆరాధించటం విశేషం.

పితృదేవతలకు మానస పుత్రిక : ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక కూడా ఉంది. ఆమె పేరుతోనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఆమె జీవన కథనంలో నేటి వారికి వారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం ఉంది. అగ్నిష్వాత్తుల మానస పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఓ సరస్సులో సృష్టించారు. ఓ రోజు వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కుమార్తెను అడిగారు. ఆమె పొరబాటుతో అప్పటివరకు సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దీంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది.

పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమాన పాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయింది. మావసుడికి ప్రియురాలు కానిదే అమావాస్య అని ఇక్కడి అర్థం. తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఆమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానసపుత్రిక మీద ఉన్న మమకారంతో అచ్చోద అమావాస్య (అమావాస్య తిథి) అయిన రోజు తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.