ETV Bharat / state

ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్​లో ఇరుక్కున్న చిన్నారి - ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే పోయిన ప్రాణం - BOY DIED IN LIFT ACCIDENT

లిఫ్టు మధ్యలో చిక్కుకుని చిన్నారి మృతి - హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ పరిధి సంతోష్‌నగర్ కాలనీలో ఘటన

Elevator Accident in Hyderabad
Elevator Accident in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 13, 2025 at 8:50 AM IST

1 Min Read

Elevator Accident in Hyderabad : హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లలో నాసిరకం లిఫ్ట్‌లు ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి సంతోష్‌నగర్ కాలనీలో ముజ్తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి చెందాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శామ్​ బహదూర్ నేపాల్​ నుంచి వచ్చి నగరంలోని​ ఓ అపార్ట్​మెంట్​లో కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. లిఫ్ట్​ పక్కనే ఉన్న చిన్నగదిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తన కుమారుడు సురేందర్​ ఆడుకుంటూ లిఫ్ట్​ తలుపుల మధ్యకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 10 నిమిషాల తర్వాత సురేందర్​ ఎక్కడున్నాడని వెతకగా లిఫ్ట్​ మధ్యలో ఇరుక్కుని చిన్నారి రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్నాడు.

వెంటనే అపార్ట్​మెంట్​ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని లిఫ్ట్​ మధ్యలో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. వీరు

నేపాల్​ నుంచి వచ్చి జీవనోపాధి : వీరు నేపాల్ నుంచి జీవనోపాధి నిమిత్తం 7 నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. తొలుత గుడిమల్కాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి కాపలాదారుగా పని చేశారు. 3 నెలల క్రితం ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కాపలాదారుగా వచ్చాడు. నిర్వాహకులు గది ఇస్తామని చెప్పడంతో శామ్ బహదూర్​ భార్య, కుమార్తె, కుమారుడిని నేపాల్‌ నుంచి తీసుకువచ్చాడు.

ప్రాణాలను చిదిమేస్తున్న లిఫ్ట్​లు - అయినా పట్టించుకోరా?

లిఫ్ట్‌ రాకముందే తెరుచుకున్న డోర్ - మూడో అంతస్తు నుంచి కిందపడి కమాండెంట్ మృతి

అపార్ట్​మెంట్​ లిఫ్ట్​లో ఇరుక్కున్న బాలుడు - ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.