ETV Bharat / state

ఈ-స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్ - కృత్రిమ కొరత సృష్టించి దోపిడీ - BLACK MARKETING OF E STAMPS

అనంతపురం జిల్లాలో ఈ- స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్ - కర్నూలు జిల్లాలో అనుమతి తీసుకుని అనంత జిల్లాలో విక్రయాలు

Stamps
Stamps (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 3, 2025 at 5:22 PM IST

2 Min Read

Black Marketing of E Stamps in Anantapur: అవినీతే పరమావధిగా పాలన సాగించిన వైఎస్సార్సీపీ అడ్డదారుల్లో దోచుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదల్లేదు. ప్రతి శాఖలోనూ అక్రమాలకు పాల్పడి గుర్తించేందుకు వీల్లేనంతగా దోపిడీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పటికీ అవినీతి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఈ-స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్ దందా ఏ రేంజ్‌లో సాగుతోందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

నాసిక్ ముద్రణాలయం నుంచి కొనుగోలు చేసే నాన్ జ్యుడీషియల్ స్టాంపులను గత ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజలకు మేలు చేసేందుకే ఈ-స్టాంపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వీటిని విక్రయించడానికి వైఎస్సార్​సీపీ నాయకులనే గుత్తేదారులుగా ఎంపిక చేసింది. జగన్ హయాంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు లేక ఆస్తుల కొనుగోలుదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఈ-స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్ - కృత్రిమ కొరత సృష్టించి దోపిడీ (ETV Bharat)

ఈ-స్టాంపుల విక్రయదారులు అందినకాడికి దోచుకున్నారు. ఈ-స్టాంపులపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ నాన్ జ్యుడీషియల్ స్టాంపులనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది కావొస్తున్నా ఈ-స్టాంపుల విధానమే కొనసాగుతోంది. అంతేకాదు పాత గుత్తేదారులనే ఉంచడంతో అక్రమాలకు కళ్లెం పడట్లేదు.

10 రూపాయల ఈ-స్టాంప్‌కు రూ.100 వసూలు: అనంతపురం జిల్లాలో ఈ-స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో ఓ గుత్తేదారు ఈ-స్టాంపుల విక్రయాలకు అనుమతి తీసుకొని ఆ జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో సిబ్బందిని నియమించుకొన్నారు. ఈ-స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ-స్టాంపులు విక్రయిస్తున్న సంస్థలు తమ పరిధిలో లేవంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చేతులెత్తేయడం విక్రయదారులకు వరంగా మారింది. ఈ-స్టాంపుల బ్లాక్ మార్కెటింగ్‌ చేస్తూ 10 రూపాయల ఈ-స్టాంప్‌కు 100 రూపాయలు దండుకుంటున్నారు.

కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో పలుచోట్ల మిగిలిన నాన్ జ్యుడీషియల్ స్టాంపులను అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి తెప్పించి 2 నెలలపాటు విక్రయించి తర్వాత చేతులు దులిపేసుకున్నారు. 8 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నాసిక్ ముద్రణాలయం నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొనుగోలుకు ఇండెంట్ చేయడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత తీవ్రంగా ఏర్పడి, స్టాంప్ వెండర్లు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం దృష్టి సారించి ఈ-స్టాంపింగ్ బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

"చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొన్నిసార్లు స్టాంపులు దొరకకపోవడంతో రిజిస్ట్రేషన్​ కూడా ఆపేస్తున్నాము. పాత స్టాంపులు రాలేదు. దయచేసి మాకు స్టాంపులు తెప్పిస్తే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టాంపులు కొరత ఉంటే మేము ఏం చేస్తాం". - శంకర్ రెడ్డి, డాక్యుమెంట్ వెండర్

భూముల రిజిస్ట్రేషన్​ విధానంలో మార్పులు - ఇక చిక్కుముడులు ఉండవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.