Bhuvanagiri Police Rescue Cows Being Taken to Cattle Slaughter : గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మాజీ సభ్యులు కొలిశెట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. గోవులను అక్రమంగా గోవధశాలకు తరలిస్తున్నారనే సమాచారంతో భువనగిరి పోలీసులు వచ్చింది. ఒరిస్సా నుంచి బహదూర్ పూర్ ఆవులను వధశాలకు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గోరక్షాదల్ టైగర్ ఫోర్స్ గో రక్షా దళ్, భజరంగ్ దళ్ కార్యకర్తలు సహకారంతో పట్టుకున్నారు.

అక్రమార్కులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి : వాహనంపై కొబ్బరిపీచు వేసి అడుగున గోవులను ఉంచి దారుణంగా తరలించే ప్రయత్నం చేశారు. అనంతరం వారి నుంచి ఆవులను కాపాడారు. 16 పాలిచ్చే గోవులను జియాగూడలోని సమర్థ కామధేను గోశాలకు తరలించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, అక్రమంగా గోమాతలను వధశాలలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని శివకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
