Best Parenting Tips In Telugu : మిర్యాలగూడకు చెందిన ఓ యువతి 22 సంవత్సరాల వయస్సులోనే జాబ్ సాధించింది. కానీ వంట ఎలా చేయాలో తెలియదు. కనీసం బట్టలు ఉతకడం, కూరగాయల పొట్టు తీయడం కూడా రాదు.
పిల్లల విషయంలో ఎప్పుడూ విద్య పట్ల జాగ్రత్త వహించడం కాదు. పిల్లలు జీవితంలో విజయవంతం కావాలంటే బాల్య దశ నుంచి వివిధ రకాల జీవన నైపుణ్యాలు చాలా అవసరం. అవి వారి విజయాలకు మార్గాలు అవుతాయి. పిల్లల్లో వీటిని పెంపొందించేందుకు పేరెంట్స్ కృషి ఎంతో అవసరం. పిల్లలు కూడా ఈ విషయంలో చురుగ్గా ఉంటూ వీటిని అభివృద్ధి పర్చుకునేందుకు ఉత్సాహంగా ఉండాలి.
పిల్లలు స్వయంగా నేర్చుకునేలా ఉత్సాహపర్చాలి : పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించడం పేరెంట్స్ బాధ్యతగా గుర్తించి వారికి మార్గనిర్దేశనం చేయాలి. ఈ విషయంలో అమ్మానాన్నలే వారికి మొదటి గురువులు. జీవన నైపుణ్యాలతో పిల్లల్లో సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతుంది. పలు విషయాలను వారు స్వయంగా నేర్చుకునేలా ఉత్సాహ పర్చాలి. నిత్య జీవితంలో వివిధ రకాల కార్యకలాపాల గురించి వారు తెలుసుకునేలా అవకాశం ఇవ్వాలి. దుకాణం, కూరగాయలు, బ్యాంకు తదితర ఆర్థిక సంస్థల కార్యాలయాల వరకు పిల్లలను వెంట తీసుకొని వెళ్లి ఆయా కార్యకలాపాలపై అవగాహన కల్పించాలి. ఇంటి కార్యకలాపాల నుంచి సామాజిక కార్యకలాపాలల్లో వారు పాల్గొనడం, చూడడం, చేయడం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. ఇవ్వన్ని వారిలో జీవన నైపుణ్యాలు పెంచేందుకు అవసరం అవుతాయి. కేవలం చదువులకు పరిమితం చేయకుండా ఇంటి వద్ద పిల్లలకు జీవన నైపుణ్యాల ప్రాముఖ్యత తెలియజేయాలి.
పిల్లలు చేయాల్సిన పనులు : -
- బూట్లు, చెప్పులు, శుభ్రం చేసి క్రమపద్ధతిలో పెట్టుకోవడం
- ఉతికి ఆరేసిన బట్టలు మడత పెట్టడం
- ఇంటికి కావాల్సిన సరకులు తీసుకురావడంలో సాయం
- వినియోగ వస్తువులు, పుస్తకాలు, దుస్తులు క్రమపద్ధతిలో అమర్చుకోవడం
"పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారికి టైం కేటాయించండి. పిల్లలతో తరచూ ఇంటి పనులు చేయించండి. వారి బాధ్యతలు వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా ఇంకా వేగంగా మెరుగ్గా చేయగలవని వారిని ప్రోత్సహించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు పిల్లలను కూడా తమ వెంట తీసుకొని వెళ్లి వివిధ పనులపై అవగాహన కల్పించండి."- డాక్టర్ భవాని, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు
పిల్లల ప్రవర్తన భయపెడుతుందా? ఎంత చెప్పినా వినడం లేదా? - 5 'సి' టెక్నిక్ ఓ సారి ట్రై చేయండి!
సెలవుల్లో పిల్లలపై ఓ కన్నేయండి - లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్‌కు బానిసైపోతారు