BC Welfare Minister Savitha About MJP School Buildings in State : ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉంటున్న ఎంజేపీ స్కూళ్లకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా 28 భవనాలకు రూ. 1210 కోట్లతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని ఈ మేరకు ప్రతిపాదనలు కూడా చేశామన్నారు. రాష్ట్రంలో మిగిలిన ఎంజేపీ స్కూళ్లకు కూడా అంచెలంచెలుగా సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సొంత భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని లేఖలు రాశామని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని గుర్తుచేశారు. బీసీ బిడ్డల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో 41 గురుకుల పాఠశాలల ఉన్నాయన్నారు. 2014-19 మధ్య 65 గురుకులాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే, గత ప్రభుత్వం కేవలం 2 గురుకులాలను మాత్రమే మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 108 ఎంజేపీ స్కూళ్లలో 106 స్కూళ్లను టీడీపీ ప్రభుత్వాలే మంజూరు చేశాయన్నారు.
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో గురుకుల స్కూళ్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కొండపల్లి ఎంజేపీ స్కూల్కు ఆనుకుని పోలీసు శాఖకు చెందిన ఎకరా స్థలాన్ని బీసీ బిడ్డల కోసం కేటాయించాలని హోం మంత్రి అనితను మంత్రి సవిత కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ఉల్లాస్’ పథకంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్షరాస్యత పెంపుదలకు కృషి చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
బీసీలకు గుడ్‌న్యూస్ - 10 నుంచి స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
వైఎస్సార్సీపీ నేతలు అధికారులను తుపాకులతో బెదిరించారు : మంత్రి సవిత