NTR National Award to Balakrishna : ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ అవార్డు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వరించింది. తెలంగాణ ప్రభుత్వం అవార్డును తనకు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు. పురస్కారం రావడం దైవనిర్ణయం, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నానని వెల్లడించారు. తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌కు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు, ఎన్టీఆర్ నటప్రస్థానం 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా తాను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డును వరించటం దైవ నిర్ణయంగా, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో నందమూరి బాలకృష్ణ తెలిపారు.
క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారు : బాలకృష్ణ
పద్మభూషణ్ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ - ఎవరికి అంకితం చేశారంటే!