Obulapuram Illegal Mining Case Update : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ముగ్గురికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజ్‌గోపాల్‌కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10లక్షల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది.
పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబుళాపురం మైనింగ్ కేసులు మే 6న నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ప్రధాన నిందితులై బి.వి.శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమాన విధించింది. గవర్నమెంట్ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పుతో వీరికి ఊరట లభించింది.
సీబీఐకి నోటీసులు : ఇదే కేసులో నిందితురాలైనా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణను హైకోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ఒకే కేసు - ఒకే రోజు - తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలిసారి ఇలా