
కళ్లకు కట్టినట్లుగా అంతరిక్ష అనుభూతి - అందంగా ముస్తాబైన అంతరిక్ష ప్రయోగశాలలు
విద్యార్థులకు అంతరిక్ష అనుభూతిని కల్పించడానికి చర్యలు చేపట్టిన జిల్లా విద్యాశాఖ - రూ.3.70 లక్షల వ్యయంతో ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు

Published : October 13, 2025 at 3:02 PM IST
Astronomy Labaratory set up in Mahabubnagar : అంతరిక్షంలో ఎన్నో వింతలు, అద్భుతాలు వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నారుల్లో ఎంతో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంతరిక్ష అనుభూతిని కల్పించడానికి మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఐదు ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు : ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. అందులో రసాయన, జీవ శాస్త్రం, భౌతిక తదితర వాటికి సంబంధించిన 42 రకాల ప్రయోగాలు చేసేందుకు కొన్ని సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠాశాలలోని విద్యార్థులకు చిన్నప్పటి నుంచి వారికి అంతరిక్షం, సైన్స్‌పై అవగాహన కల్పించాలనే ఆలోచనతో కలెక్టర్ విజయేందిర బోయి వీటిని అందుబాటులోకి తెచ్చారు.
ప్రయోగశాలలకు ఏర్పాటుకు శ్రీకారం : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల, గండీడ్ మండలం వెన్నచేడ్ జడ్పీ ఉన్నత పాఠశాల, బాదేపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల, చిన్నచింతకుంట మండలం లాల్కోట జడ్పీ ఉన్నత పాఠశాల, కోయిలకొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో మొదటి సారిగా ఈ ప్రయోగశాలలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగశాలను రూ.3.70 లక్షల వ్యయంతో నిర్మించారు. పాఠశాలల్లో అధునాతనంగా ప్రయోగశాలను నిర్మించి విద్యార్థులకు అందించారు.
కళ్లకు కట్టినట్లు ప్రయోగశాల తయారీ : ప్రభుత్వ పాఠశాలల్లోని ఖగోళశాస్త్ర ప్రయోగశాలల్లో మోడ్రన్ టెక్నాలజీ పరికరాలతో ఏర్పాటు చేశారు. మొదటగా ఓ పెద్ద గదికి మొత్తం నీలం రంగు వేశారు. అంతరిక్షంలో ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు తయారు చేశారు. ఆ తర్వాత దాని సహాయంతో ఆకాశంలో ఉన్న గ్రహాలు, చుక్కలు, నక్షత్రాలు, తోక చుక్కలు, ఉల్కలు, ఆస్ట్రారాయిడ్స్ తదితర వాటిని సులువుగా చూసి వాటిని అర్థం చేసుకునేలా విద్యార్థులకు మంచి అనుభూతిని కలిగించేలా టెలిస్కోప్‌ను సైతం కొనుగోలు చేశారు.
దానిని ఉపయోగించి తరగతి గది తలుపులు మూసి వేస్తే అంతరిక్షంలో ఉన్నట్లుగా విద్యార్థులు మధురానుభూతిని పొందుతున్నారు. ఈ ఖగోళశాస్త్ర ప్రయోగశాల చిన్న పిల్లల నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రయోగశాలను చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థులు ఆసక్తి చూపితే మిగతా పాఠశాలల్లో ఏర్పాటు : అందులో భౌతిక శాస్త్రంలో 23 ప్రయోగాలు, రసాయన శాస్త్రంలో 7, జీవ శాస్త్రంలో 12 చొప్పున ఇందులో ప్రయోగాలు నిర్వహించుకోవచ్చు. అంతేకాదు వీటికి సంబంధించిన పరికరాలు, మోడళ్లు స్పెసిమెన్లు అందుబాటులో పెట్టారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌ను 'ఈనాడు-ఈటీవీ భారత్' వివరణ కోరగా కలెక్టర్ ఈ ప్రయోగశాలలు ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు.
వీటిపై విద్యార్థులు మరింత ఆసక్తి చూపితే మిగతా పాఠశాలల్లో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. పాఠశాలలో ఖగోళశాస్త్ర ప్రయోగశాల ఏర్పాటు చేయడం వల్ల అంతరిక్షంలోకి వెళ్లిన అనుభూతితో పాటు ఉన్నత చదువులపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. దానిని పరిశీలించడం వల్ల ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పెంచుకోవడానికి సహాయపడుతుంది.
మీ పాఠశాలకు 'ఫైవ్ స్టార్' రావాలా? - స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్‌లో పాల్గొనండి
ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతి 'కథా' చిత్రం - లెసెన్ టూ ప్రోగ్సామ్స్ అన్నీ యూట్యూబ్‌లోనే

