ETV Bharat / state

పెళ్లి సంబంధాలు వెతకడంలో సాయపడుతున్న 'ఏఐ' - చిటికెలో సమాచారం మీ వద్దకు

మ్యాట్రిమోని యాప్‌లలోని లక్షల ప్రొఫైళ్లను వడపోస్తున్న కృత్రిమ మేధ - ఏఐని వినియోగించుకుంటూ వాటి సేవల్ని మెరుగుపరుచుకుంటున్న మ్యాట్రిమోని సైట్లు

Matrimony Apps Use Artificial Intelligence
Matrimony Apps Use Artificial Intelligence (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 8, 2025 at 8:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Matrimony Apps Use Artificial Intelligence : పెళ్లి సంబంధాలు వెతకడంలో ప్రస్తుతం మ్యాట్రిమోని సైట్లు ఒక కీలక మలుపు. ఇప్పుడు మరో మలుపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. అనేక మ్యాట్రిమోని యాప్‌లు ఏఐని వినియోగించుకుంటూ వాటి సేవల్ని ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకుంటున్నాయి. మ్యాట్రిమోని యాప్‌లలోని లక్షల ప్రొఫైళ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ చిటికెలో వడపోస్తోంది.

ఏఐని వాడే మ్యాట్రిమోని వెబ్​సైట్లు : మీకు సరిపోయే వ్యక్తిని వయసు, ప్రాంతం, వృత్తి, ఉద్యోగం, అభిరుచుల వంటి అనేక ప్రాధాన్యతల ఆధారంగా సెర్చ్​ చేయడానికి చాలా సహాయ పడుతుంది. ఎదుటి వ్యక్తికి మనం నచ్చామో లేదా? అని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. మనకు వచ్చిన భాషలోనే ఎంచుకోవాలనే అవసరం లేకుండా ఎలాంటి వ్యక్తినైనా ఎంచుకునే సౌలభ్యం ఈ ఏఐని వాడే మ్యాట్రిమోని వెబ్​సైట్లలో ఉంది. వ్యక్తి పంచుకున్న సమాచారం ప్రకారం అత్యంత అనుకూలమైన వ్యక్తిని మనకు సిఫార్సు చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు : ఆయా వ్యక్తుల జాతకాలనూ పూర్తిగా వివరిస్తుంది. మ్యాట్రిమోని వేదికల్లో నకిలీ ప్రొఫైల్‌తో ఎదుటి వ్యక్తిని నమ్మించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎదుటి వారు ఎన్ని విషయాలు చెప్పినా తమ వ్యక్తిగత సమాచారం ఏ మాత్రం పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరిచయం ఏర్పడిన వెంటనే అవతలి వ్యక్తులకు ఫొటోలు పంపించొద్దు. ఎటువంటి సమయాల్లోనూ ఆర్థిక లావాదేవీలు జరపొద్దని హెచ్చరిస్తున్నారు. పరిచయం ఏర్పడగానే ఒకవేళ కలవాలని అనిపిస్తే అంటే ముందు వీడియో కాల్స్‌ ద్వారా ప్రయత్నించండి.

ఇన్‌స్టాగ్రామ్‌ వివరాలు, వాట్సప్‌ నంబరు అడిగితే : ప్రొఫైల్లో ఇచ్చే సమాచారానికి ఆ వ్యక్తి ప్రవర్తించే పద్ధతికి మధ్య చాలా తేడా ఉంటే వారిపై సంబంధిత అధికారులకు తెలియజేయడం ఉత్తమమైన పద్దతి. కొంతమంది భావోద్వేగంగా దగ్గర అవుతారు. ఎమోషనల్​తో వారి చెప్పుచేతల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వీటిపై చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ మీ ఇన్‌స్టాగ్రామ్‌ వివరాలు, వాట్సప్‌ నంబరు అడిగినా ఇవ్వకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తప్పుడు సమాచారంతో నగదు కాజేసిన : కొన్ని మ్యాట్రిమోని వెబ్​సైట్ల ద్వారా మోసపోయిన వారు కూడా ఉన్నారు. గతంలో తప్పుడు ప్రోఫైల్స్​ పెట్టి యువతులను మోసం చేసిన ఉదంతాలు లేకపోలేదు. తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు వేదికగా నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని పెళ్లి చేసుకుంటానంటూ నగదు కాజేసిన ఘరానా మోసగాడిని గత మార్చి నెలలో పోలీసులు అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఏకంగా 24 కేసులున్నాయి. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మోసాలకు పాల్పడి మళ్లీ జైలు పాలయ్యాడు.

మోసాలు ఇలా : ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక లేడీ డాక్టర్​కు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా నిందితుడు పరిచయమైయ్యాడు. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ రూ.10 లక్షల 94 వేల తీసుకొని ముఖం చాటేశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సోషల్​ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మ్యాట్రిమోనిలో అతివలకు వల - షాదీ.కామ్​లో నకిలీ డాక్టర్​ నయా మోసం

మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి