
ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు మరో ఛాన్స్ - ఆ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఐటీఐకి పెరుగుతున్న డిమాండ్ - ఆల్వాల్ ఐటీఐలో ట్రేడులను బట్టి ఐదు, ఆరు దశల్లో అడ్మిషన్లు పూర్తి - ఖాళీగా ఉండే సీట్ల కోసం మరోసారి దరఖాస్తులు కోరే అవకాశం

Published : July 2, 2025 at 8:32 PM IST
Applications Invited for Admissions in Alwal ITI : పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఐటీఐలో శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన వారు ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. కొన్ని ట్రేడులకు 8వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులు.
2025-26 విద్యాసంవత్సరానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్లోని ఐటీఐలో మొదటి దశ అడ్మిషన్లు ఈ వారంలో పూర్తి చేయనున్నారు. ట్రేడులను బట్టి ఐదు, ఆరు దశల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఖాళీగా ఉండే సీట్ల కోసం మరోసారి దరఖాస్తులు కోరే అవకాశం ఉంది.
వృత్తి విద్యలో ముందున్న ఐటీఐ : వృత్తి విద్యలో ఆల్వాల్ ఐటీఐ ముందుంది. ఉన్నత చదువులకు వెళ్లలేని వారితో పాటు మధ్యలో చదువులు ఆపేసిన వారికి ఇక్కడ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా వివిధ కంపెనీల నిర్వాహకులు ఇక్కడి ఐటీఐలోనే ఉద్యోగ మేళాలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నారు. మొత్తం 251 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని పేమెంట్ సీట్లు ఉన్నాయి. దీంతో పాటు గత నుంచి ఏడాది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని (ఏటీసీ) ప్రారంభించారు. వీటిలో 172 సీట్లకు అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 423 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు : -
- రెండేళ్ల కోర్సులు : డ్రాఫ్ట్మన్ సివిల్ డ్రాఫ్ట్సమెన్ మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
- ఏడాది కోర్సులు : ఫ్యాషన్ డిజైనింగ్- టెక్నాలజీ, వెల్డర్, డీజిల్ మెకానిక్, సోలార్ టెక్నీషియన్
- ఏటీసీలో కోర్సులు : మ్యానిఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానిఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ అండ్ వర్చు వల్ వెరిఫైర్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషి యన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్, ఆర్టిసన్ యూసింగ్ అడ్వాన్స్డ్ టూల్.
"ప్రవేశాలకు సంబంధించి ఈ వారంలో కౌన్సెలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పారిశ్రామిక రంగాభివృద్ధికి ఊతమిచ్చేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ ఏడాదిలో ఏటీసీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది నుంచే ఈ కోర్సులు ప్రారంభించినా త్వరలో కొత్త భవనంలో మొదలు కానున్నాయి. ఇందుకు స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది. విద్యార్థులు కొన్ని కోర్సులపైనే కాకుండా అన్నింటిపై దృష్టి పెట్టి కౌన్సిలింగ్‌కు హాజరుకావాలి."- శంకరయ్య, ఆల్వాల్ ఐటీఐ ప్రిన్సిపల్
ఐటీఐలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
టెన్త్ తర్వాత ఉజ్వల భవిష్యత్‌కు 'ఐటీఐ' కోర్సు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలివే!

