AP Model School Exam Date Change : రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఏప్రిల్ 20న జరగాల్సి ఉండగా ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 21కి రీషెడ్యూల్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్చిన తేదీలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయో అక్కడే మార్పు చేసిన తేదీ ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాక విద్యార్థులు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అయితే ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇంటర్‌లో ప్రవేశాలకు ఇప్పటికే మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే 22వరకు కొనసాగనుంది.
'మీకు ఏం సౌకర్యాలు కావాలో అడగండి' - విద్యార్థినులతో సీఎం చంద్రబాబు
మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? ఏ సబ్జెక్టు ఏ టీచర్ బోధిస్తున్నారు? - ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం