AP MEPMA Got Skoch Platinum Awards : రాష్ట్రానికి చెందిన మెప్మాకు 9 స్కోచ్ ప్లాటినం అవార్డులు లభించాయి. పట్టణాల్లో పేదరిక నివారణకు కృషి చేసినందుకు ఇవి దక్కాయి. సెప్టెంబర్ 20న దిల్లీలో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ వీటిని అందుకోనున్నారు.
మెప్మా ఏర్పాటు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 జులైలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏర్పాటైంది. నగరపాలిక, పురపాలికలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసి వారికి పొదుపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.