ETV Bharat / state

నేడే ఇంటర్‌ ఫలితాలు - ఇలా సింపుల్​గా తెలుసుకోండి - AP INTERMEDIATE RESULTS

శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు

AP intermediate results 2025
AP intermediate results 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 11, 2025 at 11:42 AM IST

Updated : April 12, 2025 at 9:35 AM IST

2 Min Read

AP INTERMEDIATE RESULTS: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఎలా చూడాలి అంటే?: ఇంటర్‌ ఫలితాలను resultsbie.ap.gov.inలో చూడవచ్చు. లేదంటే ఎంతో సింపుల్​గా వాట్సప్​ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్​లోనే రెండే రెండు నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

AP intermediate results 2025
AP intermediate results 2025 (ETV Bharat)
  • ముందుగా మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేయాలి.
  • తరువాత మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
  • అందులో మనకు కావలసిన విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అందులో ఇంటర్మీడియట్ ఫలితాలు అనే కాలమ్​ ఉంటుంది.
  • దానిని సెలక్ట్ చేసుకుని, నిర్ధారించండి అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫలితాలు వస్తాయి.

పీడీఎఫ్‌ రూపంలో మార్కులు!: ఇంటర్మీయట్ పరీక్షలు అయిన తరువాత నుంచి వీలైనంత వేగంగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఏప్రిల్‌ 6 నాటికే మూల్యాంకనం పూర్తైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్‌ పూర్తి చేశారు. దీనికి ఐదారు రోజులు సమయం పట్టింది. ఈ సారి వాట్సప్‌లోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను PDF రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే విద్యార్థులకు షార్ట్‌ మెమోలుగానూ ఉపయోగపడనున్నాయి. గతంలో ముందుగా ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్‌ మెమోలను ఆన్‌లైన్‌లో ఉంచేవారు. అయితే ఈసారి వాట్సప్‌లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్‌ రూపంలో మార్కులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేటు కాలేజీలకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 1 నుంచే తరగతులు ప్రారంభించారు.

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం - 7 నుంచే తరగతులు

ఇంటర్​ ఫలితాలు వాట్సాప్​లోనే చూసుకోవచ్చు!

Last Updated : April 12, 2025 at 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.