AP Inter Advanced Supplementary from May 12: మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య జూన్ 6న నిర్వహించనున్నారు.

INTERMEDIATE RESULTS: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in లో చూసుకోవచ్చు. లేదంటే వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు నిమిషాల్లోనే PDF రూపంలో ఫలితాలు వస్తున్నాయి.
ఈ ఏడాది ఇంటర్మీడియ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం, హడావుడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు.
అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు: ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు.
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం - 7 నుంచే తరగతులు
విద్యార్థులకు గుడ్న్యూస్ - ఇంటర్మీడియట్లో సీబీఎస్ఈ సిలబస్