Govt Formed Task Force on liquor deaths in Jangareddygudem: 2022లో వైఎస్సార్సీపీ హయాంలో ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై కూటమి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో స్పెషల్ టస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వంలో విచారణ చేపట్టనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభు కుమార్, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్వోడీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కల్తీ మద్యం కేసును లోతుగా విచారణ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఘటనకు బాధ్యులను గుర్తించాలని సూచించింది. కాగా 2022 మార్చిలో కల్తీ మద్యం సేవించి 20మంది చనిపోయారు. 2022 మార్చిలో జంగారెడ్డిగూడెంలో నమోదైన అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మరణాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో నమోదైన 4 వేర్వేరు కేసుల ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీటిపై లోతైన విచారణ చేసి అసహజ మరణాలకు బాధ్యులు ఎవరో గుర్తించాలని ఆదేశాలిచ్చింది.
పంజాబ్ కల్తీ మద్యం కేసు- 23కు చేరిన మృతుల సంఖ్య
జగన్ హయాంలో ప్రపంచమంతా విస్తుపోయేలా మద్యం స్కాం: మంత్రి సత్యకుమార్