ETV Bharat / state

జైలులో దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - GOVT ORDERS ON DASTAGIRI CASE

జైలులో దస్తగిరిని ఇబ్బందిపెట్టిన ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఇబ్బందిపెట్టినట్లు పోలీసులకు దస్తగిరి ఫిర్యాదు

govt_orders_on_Dastagiri_case
govt_orders_on_Dastagiri_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2025, 8:48 PM IST

Govt Orders Inquiry into Incidents of Threats to Dastagiri: వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరిని కడప జైలులో బెదిరించటం, ప్రలోభపెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ను నియమించింది. శుక్రవారం ఉదయం కడప జైలులో దస్తగిరిని విచారణ అధికారి ప్రశ్నించనున్నారు. అనంతరం చైతన్యరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిని విచారణకు పిలవనున్నారు. శుక్రవారం, శనివారం కడప జైలులో ఈ విచారణ కొనసాగనుంది.

దస్తగిరి ఫిర్యాదుతో ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా.దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది. అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వక దాడి, హాని కలిగించటం, తప్పుడు సాక్ష్యాలివ్వాలని బెదిరించటం తదితర అభియోగాలు వారిపై నమోదయ్యాయి.

2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనే తనను బెదిరించారని అప్పట్లో దస్తగిరి, ఆయన భార్య పలుమార్లు చెప్పినా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో కేసు నమోదు చేయలేదు. ఆ ఘటనపై దస్తగిరి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరి 5న కేసు నమోదైంది.

మస్తాన్ సాయి మనిషి కాదు - 'ఆ వీడియోల్లో ఎంతో మందికి డ్రగ్స్!'

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ - ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.