Govt Forms Aquaculture Advisory Committee: ట్రంప్ టారిఫ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆక్వా ఎగుమతులపై అమెరికా టారిఫ్ సవాళ్లు అధిగమించే చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఆక్వా ఎగుమతిదారులు, రైతులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు, హేచరీలు, ఎంపెడాకు చెందిన మొత్తం 16 మంది సభ్యులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే విషయంపై ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు కోరారు.
పన్ను ఎగవేతకు ఏఐతో చెక్ పెట్టండి: సీఎం చంద్రబాబు
జీవితం చాలా చిన్నది - సమయం వృథా చేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి: మనీష్ దేవరాజ్