Anganwadi Menu Change in AP : బాల్యం బక్కచిక్కుతోంది. పోషకాహార లేమితో చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పంపిణీ చేసే ఆహారం ఆరోగ్యకరంగా, బలవర్ధకంగా ఉండేలా చర్యలు చేపట్టింది. చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించేలా కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల నుంచి దీనిని అమల్లోకి తీసుకురానుంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3558 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 2,71,588 మంది వరకు ఉన్నారు. వీరిలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, మధ్యాహ్నం పప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం ప్యాకెట్లను ఇస్తున్నారు.
- గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులను ఒకే సమూహంగా పరిగణించేవారు. ప్రస్తుతం వారిని 6 నెలల నుంచి 12 నెలలు, 12 నెలల నుంచి మూడేళ్ల పిల్లలుగా రెండుగా విభజించారు.
- మూడేళ్ల నుంచి ఆరేళ్ల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో వారంలో రెండు మార్లు ఎగ్‌ప్రైడ్ రైస్ ఇవ్వనున్నారు. ఉదయం ఉడికించిన శనగలు అందిచనున్నారు. అదేవిధంగా అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగిస్తారు.
మూడు సంవత్సరాల లోపు పిల్లలకు అందించే బాలామృతంలో తీపి శాతాన్ని తొలగించనున్నారు. ఈ బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారు. ఈ మార్పును అమలు చేసే కార్యక్రమంలో భాగంగా మొదట ప్రతి జిల్లాకు ఓ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బి.క్యాంప్ ప్రాజెక్టులోని ఒక కేంద్రాన్ని దీనికి ఎంపిక చేశారు.
చుక్కలు చూపిస్తోన్న యాప్ - అంగన్‌వాడీల్లో తప్పని తిప్పలు
బాలామృతంలో చక్కెర తక్కువ పోషకాలు ఎక్కువ - 'అక్షయ పాత్ర'కు తయారీ బాధ్యతలు