AP Government on Tariff Subsidy : ఏపీ డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.4470 కోట్ల సబ్సిడీ విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీని భరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
2025-2026 ఆర్ధిక సంవత్సరంలోని తొలి త్రైమాసికానికి రూ.4470 కోట్ల విడుదలకు పాలనానుమతి ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. విద్యుత్ వినియోగదారులపై టారిఫ్ల భారం పడకుండా సబ్సిడీ మొత్తాన్ని బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ నిధులను డిస్కంలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.
సమ్మర్లో కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్నారా - అయితే ఈ టిప్స్ పాటించండి