AP Govt Announces Incentives for Sports Persons: రాష్ట్ర క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. గత వైఎస్సార్సీపీ హయాంలో 11.68 కోట్ల రూపాయలు క్రీడా ప్రోత్సహకాలు పెండింగ్‌లో పెట్టడంతో 224 మంది క్రీడాకారులు ఇబ్బంది పడ్డారని రవినాయుడు తెలిపారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రవినాయుడు ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం 189 మంది క్రీడాకారులకు 7.96 కోట్ల రూపాయలు విడుదల చేశారు. క్రీడా ప్రోత్సాహకాలు ఇచ్చిన చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్‌కి రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడాకారులకు ఇకపై పండగే - కొత్త క్రీడా విధానంతో ఎన్నో ప్రయోజనాలు
పతకాలు కొట్టేందుకు పంతాలే అడ్డం? - గొడవలతో నలిగిపోతున్న ఆటగాళ్లు