ETV Bharat / state

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు - సైయెంట్, ఏఐసీటీఈతో ప్రభుత్వం ఒప్పందం - AP GOVT MOU WITH CYIENT

ఏపీ సర్కార్ కీలక ఒప్పందం - సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం మధ్య అవగాహన ఒప్పందం

Lokesh on Cyient Agreement
Lokesh on Cyient Agreement (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 11, 2025 at 4:44 PM IST

1 Min Read

Lokesh on Cyient Agreement : యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్​వేర్ సంస్థ సైయెంట్, ఏఐసీటీఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్​ సమక్షంలో సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

ఇది త్రైపాక్షిక ఒప్పందం. తద్వారా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థల్లో వ్యాపార దృక్పథం, మేథోసంపత్తి (ఐపీ) సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు, సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు.

AP Govt MOU in AICTE : ఈ ఒప్పందం ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడుదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఇందులో భాగంగా ఐ-కేర్, ఐ-కేఫ్ కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేథోసంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యాసంస్థలపై దృష్టి సారించనున్నారు.

ఈ మేరకు బూట్ క్యాంప్స్, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఎంటర్ ప్రెన్యూర్​షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. క్లస్టర్ స్థాయి కాంక్లేవులు, పరిశ్రమ నిపుణులతో మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో వీటికి సంబంధించిన శిక్షణ, సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. వివిధ రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీస్​గా ఏపీఎస్ఎస్​డీసీ వ్యవహరించనుంది.

రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు - 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి లోకేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 'షైనింగ్‌ స్టార్స్‌' అవార్డుల ప్రదానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.