AP Deputy CM Pawan Kalyan Video Viral : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం (ఏప్రిల్ 12) రాత్రి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తన కుమారుడిని పవన్ ఎత్తుకుని ఎయిర్‌పోర్ట్‌లోని ఎస్కలేటర్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది : మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసి మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, స్నేహితులు, జనసేన నేతలు, అభిమానులు, కుటుంబసభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్‌లో వైద్య చికిత్సకు సహకరించిన మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కుమారుడిని కాపాడిన భారతీయ కార్మికులు- సత్కరించిన సింగపూర్ ప్రభుత్వం
'ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్'- పవన్ కుమారుడు కోలుకోవాలని ఎన్టీఆర్ పోస్ట్