ETV Bharat / state

"రెడ్​బుక్"​ ఇంకా తెరవలేదు- తెరిస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా: మంత్రి లోకేశ్ - nara lokesh reacts on redbook

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 9:20 PM IST

Minister Nara Lokesh on Red Book : రెడ్‌బుక్‌ తెరవకముందే జగన్‌ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లను రెడ్‌బుక్‌లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. జగన్‌రెడ్డి రెడ్‌బుక్‌కు జాతీయ మీడియాను బతిమాలి మరి పిలిపించి ప్రచారం కల్పిస్తున్నారని లోకేశ్‌ పేర్కొన్నారు.

Minister Nara Lokesh responds on Red Book
Minister Nara Lokesh on Red Book (ETV Bharat)

Minister Nara Lokesh responds on Red Book : తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్​బుక్​లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్​బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే, విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి రెడ్​బుక్​కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి మరీ ప్రచారం కల్పించారని ఆయన పేర్కొన్నారు.

జగన్​ హయాంలో ఏపీకి ఆదాయం తగ్గి - అప్పులు పెరిగాయి : ఏపీ సీఎం చంద్రబాబు - White Paper on AP Financial Status

గౌరవంగా చూసుకుంటాం.. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 మీడియా సమావేశాలు పెడితే, ఈఎన్నికల్లో 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్‌మీట్‌లు పెట్టారని లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే, వాస్తవాలను తాము వివరిస్తామని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుంటామని ఎద్దేవా చేశారు. వైఎస్సార్​సీపీ నేతల వలే, కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని ఆయన తెలిపారు.

ఇవాళ అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేశ్​కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆయనని కలిసి తమ తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Srikalahasti MLA Bojjala Sudhir Reddy : లోకేశ్‌ దగ్గర ఉన్న రెడ్​బుక్​లో మొదటి పేరు జగన్‌దేనని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రెడ్​బుక్ గురించి జగన్ దిల్లీలో కూడా చెప్పటం హాస్యాస్పదమని ఆయన తెలిపారు. మదనపల్లిలో ఫైల్స్ తగలపెట్టిన కేసులో నిందితులను ఎవరినీ వదలమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.

జగన్ అసెంబ్లీకి రావాలి : జగన్‌ అసెంబ్లీకి రాకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైఎస్సార్​సీపీ హయాంలో క్రైం క్యాపిటల్‌, గంజాయి క్యాపిటల్‌గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. జగన్‌ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి అన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు.

తిరిగి సొంత గ్రామానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా : గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh Saved Virendra Kumar

గాంధీ ఫొటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారు - పంచాయతీల సొమ్ము డిస్కంలకు మళ్లించారు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Speech in Assembly

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.