Ammonia Gas Leak at Waterbase Company in Nellore District : నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్‌తో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ అమోనియా గ్యాస్ చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా వారంతా మాస్కులు ధరించారు.
గ్యాస్ లీక్ కాగానే అలారం మోగింది : టీపీ గూడూరులో అమోనియా లీకేజీపై నెల్లూరు ఆర్డీవో వివరణ ఇచ్చారు. నీటి ఆధారిత గ్యాస్ కంపెనీలో అమోనియా లీకేజీ అయ్యిందని తెలిపారు. అమోనియా గ్యాస్ లీక్ కాగానే అలారం మోగింది. అలారం మోగగానే భయంతో సిబ్బంది పరుగులు తీశారని, బయటకు వచ్చే సమయంలో కిందపడి కొందరికి గాయాలయ్యాయని వెల్లడించారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించామని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
పరిశ్రమలో గ్యాస్ లీక్ - 50 మందికి తీవ్ర అస్వస్థత! - GAS LEAK in AP
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు అదనపు పరిహారం - 2 విడతల్లో రూ. 120 కోట్లు