ETV Bharat / state

హైదరాబాద్​లోని ఆ ప్రాంతంలో తరచూ పాడవుతున్న ఏసీలు - అలా ఎందుకు జరుగుతుందంటే? - ACS DAMAGE BY POLLUTE WATER IN MUSI

మూసీ నది కాలుష్య భూతం - పాడవుతున్న ఏసీ, రిఫ్రిజిరేటర్లు, టీవీలు - హైడ్రోజన్​ సల్ఫైడ్​ కారణమంటున్న నిపుణులు

Musi River Catchment Areas are Pollute
Musi River Catchment Areas are Pollute (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 27, 2025 at 11:08 AM IST

3 Min Read

Musi River Catchment Areas are Pollute : మూసీ పరివాహక ప్రాంతాల్లోని సామాన్యులు అల్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడున్న వారి ఇళ్లలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తరచూ పాడవుతున్నాయి. ఏసీ మరమ్మతుకు గురైతే ఒకేసారి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతోంది. అదేవిధంగా రిఫ్రిజిరేటర్​ లేదా టీవీ పాడైతే కనీసం రూ.5 వేలు సమర్పించుకోవాల్సిందే. ఇలా విడిభాగాలు మారిస్తే జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది. ఫార్మా, బల్క్​ డ్రగ్ పరిశ్రమలు నిత్యం వ్యర్థ జలాలను మూసీలో వదులుతుండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలాల నుంచి కుళ్లిన కోడిగుడ్డు వాసనతో వెలువడుతున్న హైడ్రోజన్ సల్ఫైడ్​ ఎలక్ట్రానిక్​ ఉపకరణాల్లోని విడిభాగాలు తప్పుపట్టేలా చేస్తోంది.

ప్రభావం ఇదీ మరి : హైడ్రోజన్​ సల్ఫైడ్​ ఎయిర్​ కండిషనర్​ భాగాల్లో ముఖ్యంగా రాగి కాయిల్​లు తుప్పు పట్టడానికి కారణం అవుతున్నాయి. దీంతో లీకేజీలు, బ్రేక్​డౌన్​ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏసీ పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి విద్యుత్​ వినియోగం, నిర్వహణ ఖర్చులను పెంచుతోంది. ఈ వాయువు గాలిలోని తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్​ ఆమ్లం లేదా ఇతర సల్ఫర్​ సమ్మేళనాలను ఏర్పరిచి ఏసీలను పాడు చేస్తున్నాయి. ఏసీలోని కాపర్​ కాయిల్​లు, ట్యూబింగ్​, ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపుతాయని పీసీబీ అధికారి డి.ప్రసాద్​ తెలిపారు. అలాగే ఐఐటీ మద్రాస్​లోని ఇంజినీరింగ్​ విభాగం తన అధ్యయనంలోనూ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.

పుట్టగొడుగుల్లా మరమ్మతు కేంద్రాలు : బాపూఘాట్​, గండిపేట, ముసారాంబాద్​ బ్రిడ్జి, ప్రతాప సింగారం, పీర్జాదిగూడ వరకు మూసీ నది నీటి నాణ్యతను పీసీబీ పరీక్షిస్తోంది. గండిపేట వద్ద మినహా ఇతర ప్రాంతాల్లో డిజాల్వ్​డ్​ ఆక్సిజన్​, బయో లాజికల్​ ఆక్సిజన్​ డిమాండ్​ నిర్దేశిత మోతాదులో లేకపోవడం గమనార్హం. ఫలితంగా రాజేంద్రనగర్​, లంగర్​హౌజ్​, చాదర్​ఘాట్, కార్వాన్​, గోల్నాక, నయాపూల్​, శంకర్​నగర్​, మూసానగర్​, ఉప్పల్​, నాగోల్​, మలక్​పేట్​, ఇబ్రహీంబాగ్​ తదితర ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏసీల మరమ్మతు కేంద్రాలు ఆ ప్రాంతాల్లో పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నాయి.

మెట్రోరైళ్ల రాకపోకలపై ప్రభావం : మెట్రో రైళ్ల ప్రయాణాలపైనా ఈ కాలుష్య ప్రభావం కోరలు చాచుతోంది. ఉప్పల్ నుంచి రాకపోకలు సాగించే సమయంలో సాంకేతిక సమస్యలకు ఈ కాలుష్య కారకాలే కారణమని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. మురుగు బాగా పేరుకుపోయిన చోట, కలుషిత జలాలతో వాతావరణంలోకి వెలువడే హైడ్రోజన్​ సల్ఫైడ్​ వల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.

కుళాయిల గొళ్లాలు సైతం తుప్పు : మరమ్మతులు, టెక్నీషియన్ల సూచన మేరకు వేసే రంగులతో తాత్కాలిక పరిష్కారం లభిస్తుందని, ఉపరితల జలాల ప్రవాహం ఎప్పుడూ పారుతూ ఉంటే వాయువు విడుదల అవ్వదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. హైడ్రోజన్​ సల్ఫైడ్​ వాయువు కారణంగా ఇంట్లోని వస్తువులు సైతం రంగు మారుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వెండి సామగ్రి, కుళాయిలు, తలుపుల హ్యాండిల్స్​, గొళ్లాలు పాడైపోతున్నాయని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం :

  • మూసీ నదికి ఐదు హాట్​స్పాట్​లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్​ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో రెండు, మేడ్చల్​లో ఒకటి ఉన్నాయి.
  • 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్​ లీటర్ల వ్యర్థ జలాలు వస్తుండగా వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగిస్తున్నట్లు పీసీబీ తెలుపుతోంది.
  • మరో 326కి పైగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్​ ఎఫ్లుయెంట్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లకు వెళ్తున్నాయి. ఇలా శుద్ధి చేసిన నీటిని ప్రతిరోజూ 4 మిలియన్​ లీటర్లను అంబర్​పేట వద్ద నదిలో కలుస్తాయి.
  • నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి జరిగితే మూసీ మురికికూపంగా మారదని పీసీబీ లెక్క కట్టింది.
  • ఇందులో అంబర్​పేట తర్వాత ఉప్పల్​, మల్లాపూర్​, నాచారం పారిశ్రామికవాడల నుంచి వచ్చే జలాలు ఉప్పల్​ నల్లచెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసీ తీవ్ర కాలుష్యం బారిన పడుతోంది. దిగువన ఉన్న ఘట్​కేసర్​, హయత్​నగర్​లోని పరిశ్రమలు సైతం మూసీని కలుషితం చేసేస్తున్నాయి.

మూసీ, హైడ్రాలపై ప్రత్యేక దృష్టి - బడ్జెట్​లో భాగ్యనగరానికి పెరిగిన కోటా

మూసీ అభివృద్ధి పనిలో ముందడుగు - ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.