ACB Searches Conducted at Allagadda Deputy EE House At Nandyala : ఏపీఎస్పీడీసీఎల్ ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ రవికాంత్ చౌదరి ఈనెల 16న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మంగళవారం సోదాలు చేపట్టారు.
నంద్యాల పట్టణ శివారులోని రైతునగరంలో నివాసముంటున్న ఈఈ ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ ఈ సోదాల్లో విలువైన బాండ్లు, ఇళ్ల స్థలాలు, కర్నూలులో ఒక అపార్టుమెంట్, నంద్యాలలో రూ.కోటికి పైగా విలువైన ఇంటిని గుర్తించామన్నారు.
రవికాంత్ భార్య హిమబిందు పేరిట పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో ఓ లాకర్ ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 2.825 కిలోల 41 రకాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. లాకర్ కీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా సోదాలు చేయాల్సి ఉందని మరిన్ని ఆస్తుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
'డబ్బు వడ్డీకైనా తెచ్చి సెటిల్ చేసుకో - లేదంటే జైలే'
రైతుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి - బయటపడ్డ ఫోన్ రికార్డింగ్లు