ETV Bharat / state

ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి తప్పించుకోబోయి - విగతజీవిగా మారి - young man died in khammam - YOUNG MAN DIED IN KHAMMAM

Young Man Died in Khammam : అప్పు తీసుకోవడమే అతడి పట్ల యమపాశంగా మారింది. లోన్ రికవరీ ఏజెంట్లే యమదూతలుగా మారారు. ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్న పాపానికి, రికవరీ ఏజెంట్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. బైక్​పై వెంబడించి మరీ తరిమారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో సదరు యువకుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

MAN DIED WHILE ESCAPING AGENTS
Young Man Died in Khammam
author img

By ETV Bharat Telangana Team

Published : April 5, 2024 at 10:00 PM IST

1 Min Read

Young Man Died in Khammam : పొట్టచేత పట్టుకుని, కూలీ పనిచేసుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడు, ఫైనాన్స్(Private Finance) రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో మునిగి చనిపోయాడు. ఈఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే.. ఉత్తరప్రదేశ్​కు చెందిన వినయ్ అనే వ్యక్తి ఖమ్మం పట్టణానికి వలస వచ్చాడు. స్థానిక మూడో పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటూ, మార్బుల్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు.

ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి తప్పించుకోబోయి- విగతజీవిగా మారి

లోన్​ ఇప్పిస్తామని నమ్మబలికారు - మహిళల పేరిట ఖాతాలు తెరిచి రుణం తీసుకున్న కేటుగాళ్లు

పట్టణంలోని మోహన్​ సాయి అనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి వినయ్ రుణం తీసుకుని, ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదని రికవరీ ఏజెంట్లు ప్రశ్నించారు. వారి నుంచి కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న వినయ్, శుక్రవారం మార్బుల్ పని నిమిత్తం బల్లేపల్లికి వెళ్లాడు. అతను అక్కడ ఉన్నట్లు తెలుసుకున్న రికవరీ ఏజెంట్లు, ఇంటి నిర్మాణ ప్రాంతానికి వచ్చారు.

కిస్తీ డబ్బులు కట్టాలని బెదిరించి కర్రలతో కొట్టారు. భయపడిన వినయ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అనంతరం రికవరీ ఏజెంట్లు వెంబడించారు. ఈ దృశ్యాలు ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి మృతిచెందాడు. అతడు చెరువులోకి దూకిన తర్వాత కూడా రికవరీ ఏజెంట్లు రాళ్లు విసురారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏం తెలివి భయ్యా నీది - నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు దోచేశాడుగా

ఫేక్​ లోన్​ యాప్​లను ఇలా గుర్తించండి! - ఆ వలలో పడిపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.