ETV Bharat / state

హైదరాబాద్​లో తప్పిపోయి జమ్మూ సరిహద్దుల్లో ప్రత్యక్షం - MISSING CASE IN HYDERABAD

3 నెలల క్రితం వెంకటరావు అనే వ్యక్తి అదృశ్యం - జమ్మూ సరిహద్దుల్లో వెంకటరావును గుర్తించిన బోర్డర్ పోలీసులు - 30 ఏళ్ల నుంచి హైదరాబాద్​లోని కేపీహెచ్​లో స్థిరపడిన కుటుంబం

Venkatarao Missing in Hyderabad
శ్రీనుకు తండ్రి వెంకటరావును అప్పగిస్తున్న బీఎస్​ఎఫ్​ జవాన్లు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 14, 2025 at 3:10 PM IST

1 Min Read

A Man Missing in Hyderabad : హైదరాబాద్‌లో అదృశ్యమైన వ్యక్తిని జమ్మూ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం నేలటూరుకు చెందిన వెంకటరావు కుటుంబం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్​లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటోంది. ఈ క్రమంలో 3 నెలల క్రితం వెంకటరావు(50) అదృశ్యమయ్యాడు. మార్చి 31వ తేదీన జమ్మూలోని ఇంటర్నేషనల్​ బోర్డర్​ అఖ్నూర్‌ సెక్టార్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెంకటరావును బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబసభ్యులకు సమాచారం : వెంకటరావును జవాన్లు వివరాలు అడిగినప్పటికీ చెప్పలేకపోయాడు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వివరాలు సేకరించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈనెల 11న జమ్మూ వెళ్లిన అతడి కుమారుడు శ్రీనుకు బీఎస్​ఎఫ్​ పోలీసులు వెంకటరావును అప్పగించారు. తండ్రిని తీసుకొని ఆదివారం (ఏప్రిల్​ 13) ఇంటికి చేరిన శ్రీను మాట్లాడుతూ 3 నెలలుగా తండ్రి కోసం వెతికామని, అంతదూరం ఆయన ఎలా వెళ్లారనేది ఇప్పటికీ తెలియడం లేదన్నారు.

​సికింద్రాబాద్​లో మిస్సింగ్​ కలకలం - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు!

భార్య మిస్సింగ్ - కంటి చూపు మందగించి భర్తకు ఆపరేషన్! కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్​లో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.