Drunken Man Stabbed Woman : మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను చంపాలనుకుని పక్కింట్లో ఉండే మరో మహిళపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధి కాటేదాన్‌లో శుక్రవారం జరిగింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్ దంపతులు మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. సలీమ్ అతని భార్య మున్నీ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వీరి పక్కింట్లో అబేదా (25) ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో పక్కింట్లోకి వెళ్లిన సలీమ్, తన భార్య అనుకొని అబేదాపై కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొత్త ఇంట్లోకి వచ్చి 40 రోజులే అయింది - రిటైర్డ్ వృద్ధ దంపతులను దారుణంగా చంపేశారు
'మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేస్తున్నావ్?' - కుమార్తెను వేధిస్తున్నాడని బాలుడి హత్య