Car Driver Harashment to Womens : యువతుల న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ కారు డ్రైవర్ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, విజయవాడలోని ఓ ప్రాంతానికి చెందిన కుటుంబం గత ఏడాది సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌లో కారు బుక్ చేసుకుని మచిలీపట్నం బీచ్‌కు వెళ్లారు. డ్రైవర్ రాజు అక్క అంటూ కారులోని మహిళతో వరుస కలిపాడు. బీచ్‌కు వెళ్లిన తర్వాత రాజు మహిళ కుమార్తెతో మాటలు కలిపి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి బాలికకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పాడు. కొంతకాలం గడిచిన తర్వాత మాయమాటలు చెప్పి బాలికకు వీడియో కాల్ చేసి నగ్న చిత్రాలు సేకరించాడు.
మీ అమ్మ, నాన్నను చంపేస్తా : చంపేస్తానని ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ‘మీ అమ్మాయి నాకు న్యూడ్ ఫొటోలు పంపింది. అవి బయటకు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. విడతల వారీగా అతని ఫోన్ పే నంబరుకు రూ.20 వేలు చెల్లించారు. ఫొటోలు ఎందుకు పంపావని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. ‘న్యూడ్ ఫొటోలు పంపకపోతే మీ అమ్మ, నాన్నను చంపేస్తా’ అంటూ బెదిరించినట్లు తెలిపింది.
ఈ నెల 2న రాజు బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులను బెదిరించి మరో రూ.50 వేలు తీసుకున్నాడు. నాలుగు రోజుల నుంచి మళ్లీ మరో రూ.50 వేలు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. చేసేది లేక బాధితులు గురువారం పటమట పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోక్సో, ఐటీ యాక్ట్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.
ఆ ఫోన్‌లో వీడియోలు ఎన్నో? : కైకలూరుకు చెందిన రాజు అమ్మాయిలను మాయమాటలతో మభ్యపెట్టి వారి న్యూడ్ ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అడ్డు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది యువతులు పైకి చెప్పుకోలేక రూ.లక్షల్లో చెల్లించారు. గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అతని వ్యవహారాలు తెలిసి భార్య కూడా వదిలేసినట్లు తెలిసింది. అతని ఫోన్‌లో పదుల సంఖ్యలో యువతుల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు శుక్రవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పక్కనే ఉంటూ ఆన్‌లైన్‌లో వేధింపులు! - అశ్లీల సైట్లలోనూ పోస్టులు
profeser sexuval harashment: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశం