ETV Bharat / state

పెనుకొండ కియా పరిశ్రమలో భారీ చోరీ - 900 ఇంజిన్లు మాయం - CAR ENGINES THEFT AT KIA FACTORY

కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 900 ఇంజిన్లు చోరీ - ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు

car_engines_theft_at_kia_factory_in_sathya_sai_district
car_engines_theft_at_kia_factory_in_sathya_sai_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 8, 2025 at 11:37 AM IST

Updated : April 8, 2025 at 1:02 PM IST

1 Min Read

900 Car Engines Theft at Kia Factory in SathyaSai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా? కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశముంది.

మంత్రి సత్యకుమార్‌ అనుచరుడి రౌడీయిజం - రాడ్లు, కర్రలతో దాడి చేసి భూకబ్జాకు యత్నం

పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నాం - 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం: నారా లోకేశ్

Last Updated : April 8, 2025 at 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.