16th Finance Commission AP Tour : రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రతినిధులు విమానాశ్రయం నుంచి విజయవాడ బయల్దేరారు. రాత్రికి విజయవాడ నోవాటెల్ హోటళ్లలో బసచేయనున్నారు.
బుధవారం నాడు ఆర్థిక సంఘం ప్రతినిధులు ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల వరకు సచివాలయంలోని మొదటి బ్లాకులో అమరావతి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ తిలకించనున్నారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం విందు ఇవ్వనున్నారు.
అదేరోజు రాత్రి పది గంటలకు విజయవాడ నుంచి వారు తిరుపతికి వెళ్లనున్నారు. 17న (గురువారం) మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వాణిజ్య వ్యాపారవర్గాలతో భేటీ కానున్నారు. 18న శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
పెండింగ్ బిల్లుల బకాయిల చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్
ఏపీకి కేంద్రం శుభవార్త - పోలవరానికి భారీగా నిధులు - ఇంత మొత్తంలో ఇవ్వడం ఇదే తొలిసారి