ETV Bharat / sports

'చాహల్- నీ టాలెంట్‌ మామూలుగా లేదుగా!' - రూమర్డ్​ గర్ల్​ఫ్రెండ్​ క్రేజీ పోస్ట్​! - YUZVENDRA CHAHAL RJ MAHVASH

'చాహల్​ నీ టాలెంట్‌ సూపర్!' - క్రికెటర్​ను పొగడ్తలతో ముంచెత్తిన రూమర్డ్​ గర్ల్​ఫ్రెండ్!

Yuzvendra Chahal RJ Mahvash
Yuzvendra Chahal RJ Mahvash (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : April 16, 2025 at 10:17 AM IST

1 Min Read

Yuzvendra Chahal RJ Mahvash : టీమ్‌ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌- రూమర్ గర్ల్​ఫ్రెండ్​ రేడియో జాకీ మహ్‌వశ్‌ డేటింగ్ చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వాటికి ఆజ్యం పోస్తున్నట్టు మహ్​వశ్​ కూడా ఇండైరెక్ట్​గా చాహల్​పై పోస్టుల మీద పోస్టులు పెడుతోంది. ఇటీవల 'అతడే నాకు అన్నీ' అంటూ ఫ్యూచర్ హస్బెండ్ గురించి వీడియోలో చెప్పుకొచ్చిన ఈ చిన్నది తాజాగా మరో పోస్టు పెట్టింది. చాహల్​ ఫొటోను షేర్​ చేసి కితాబిచ్చింది. ఇంతకీ మహ్​వశ్​ ఏమందంటే?

'నీ ట్యాలెంట్ సూపర్​'
మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఈ పంజాబ్‌ బౌలర్‌ అద్భుతంగా రాణించాడు. మ్యాచ్‌ అనంతరం చాహల్‌ను మెచ్చుకుంటూ మహ్‌వశ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ చేసింది. అతడితో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేసి- "నీ టాలెంట్‌ మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించావ్‌. అసంభవ్!" అని క్యాప్షన్ ఇచ్చింది.

మహ్​వశ్​ చేసిన మహ్​వశ్​ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లను చాహల్‌, మహ్‌వశ్‌ కలిసి చూశారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్​ మొదలయ్యాయి. అయితే వీరిద్దరూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. కాగా, ఈ మధ్య చాహల్‌ ఆడుతున్న మ్యాచ్‌లన్నింటికీ వచ్చి మహ్‌వశ్‌ గ్యాలరీలో సందడి చేస్తోంది.

ఇటీవల కూడా మహ్​వశ్​ చాహల్​ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. అతడితో తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేసింది. దానికి "ఇది మీ వాళ్లకు అన్నివేళలా సపోర్ట్​గా నిలుస్తూ, వారి వెనక స్ట్రాంగ్​గా నిలుస్తున్నందుకు. మీకోసం మేమందరం ఉన్నాం" అని వ్యాఖ్య జోడించింది. దీనికి చాహల్‌ స్పందించాడు. "మీరు నా వెన్నెముక. నేను ఎంతో ఉన్నతస్థాయిలో నిలిచేందుకు సహకరిస్తున్న మీకందరికీ థ్యాంక్స్​" క్యాప్షన్​ జోడించాడు. దీంతో వీరి ప్రేమ బంధం నిజమేనేమో అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా చాహల్‌ ఇటీవలే తన భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.