Yograj On Arjun Tendulkar : క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ వారసుడు అర్జున్ తెందూల్కర్ ఇండియన్ జెర్సీలో ఆడితే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే దానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అర్జున్ బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తూ, యువరాజ్ దగ్గర శిక్షణ పొందితే మరో క్రిస్ గేల్ అవుతాడని యోగరాజ్ చెప్పాడు.
డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు అర్జున్ గోవాకు వెళ్లే ముందు తన వద్ద శిక్షణ పొందాడని యోగరాజ్ వెల్లడించాడు. అర్జున్ తన దృష్టిని బౌలింగ్ నుంచి బ్యాటింగ్‌కు మార్చాలని సూచిస్తున్నాడు. 'నేను అర్జున్‌కు బౌలింగ్‌పై తక్కువ దృష్టి పెట్టి, బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పాను. సచిన్‌కి చాలా సన్నిహితుడైన యువరాజ్ అర్జున్‌కి కేవలం మూడు నెలలు శిక్షణ ఇస్తే అతడు మరో క్రిస్ గేల్‌గా మారగలడని నాకు నమ్మకం ఉంది' అని యోగ్రాజ్ తెలిపాడు.
'కొన్నిసార్లు బౌలర్లు స్ట్రెస్ ఫ్రాక్చర్లు వంటి దీర్ఘకాలిక గాయాలతో ఇబ్బంది పడతారు. ఇది వారి బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. అలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం వల్ల ఆటగాడికి క్రికెట్‌లో రెండో అవకాశం లభిస్తుంది. ఇప్పుడు స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు బౌలర్‌గా మాత్రమే చూసింది'
'కానీ యువరాజ్ అతని రికార్డులను చూసినప్పుడు అభిషేక్ ఆ సమయంలో అప్పటికే 24 సెంచరీలు చేశాడు. యువీ నాతో అభిషేక్‌ని చూడమని చెప్పాడు. కొంతమంది తమ సొంత కెరీర్‌పై దృష్టి పెట్టడం కంటే అసూయతో తప్పుడు సమాచారం ఇస్తారు. అభిషేక్ శర్మ విషయంలో అదే జరిగింది' అని యోగరాజ్ తెలిపాడు.
అర్జున్ ఐపీఎల్ కెరీర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అర్జున్ ముంబయి ఇండియన్స్ (MI) స్క్వాడ్‌లో ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అర్జున్‌ను మొదట 2021లో ముంబయి కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. చివరికి 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఒక ఇన్నింగ్స్‌లో 9 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ముందు అర్జున్ తెందూల్కర్ సంచలనం! - సచిన్ సాధించలేని ఆ రేర్ రికార్డ్ సొంతం
Arjun Tendulkar Six Pack : సీనియర్ల బాటలోనే అర్జున్.. సిక్స్‌ప్యాక్‌తో మిర్రర్ సెల్ఫీకి పోజునిస్తూ