Yograj Singh On Rohit Sharma : భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. మహేంద్రసింగ్ ధోనీ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. వరుసగా టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాడు. ఇటీవల దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం, తన రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లకు రోహిత్ ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
అయితే వచ్చే నెలలో రోహిత్‌కు 38 సంవత్సరాలు నిండుతాయి. దీంతో రోహిత్ టెస్టు కెరీర్ గురించి మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భారత కోచ్‌గా నియమిస్తే తీసుకొచ్చే మార్పుల గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
రోహిత్‌ను 20 కిమీ పరిగెట్టిస్తా!
'నన్ను టీమ్ఇండియాకు కోచ్‌గా చేస్తే, నేను ఈ ఆటగాళ్లతోనే టీమ్‌ను స్ట్రాంగ్‌గా చేస్తా. ఆటగాళ్లను తరచూ జట్టు నుంచి తీసేస్తే, వాళ్ల సామర్థ్యాన్ని ఎవరు బయటకు తెస్తారు? కొందరైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పక్కన పెట్టాలని అంటున్నారు. వారు ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. నా పిల్లలతో సమానమైన వారికి ఈ సమయంలో నేను మద్దతుగా ఉంటాను'
'వారు రంజీల్లో ఆడాలని కోరతాను. రోజుకు 20 కి.మీ పరిగెత్తమని రోహిత్‌కు చెప్తాను. ఈ ఇద్దరు టీమ్ఇండియాకు దొరికిన వజ్రాలు. వాళ్లను వదులుకోకుడదు. నేను వారికి తండ్రిలాంటి వాణ్ని. యువరాజ్‌కు ఇతరులకు మధ్య నేను ఎప్పుడూ తేడా చూపలేదు. ధోనిని కూడా అలా చూడలేదు. కానీ ఎప్పటికీ తప్పును మాత్రం తప్ప అని చెబుతాను' అని యోగ్‌రాజ్ చెప్పారు.
కాగా, మాజీ క్రికెటర్ సచిన్ కుమారుడు అర్జున్ గురించి కూడా మాట్లాడాడు. 'అర్జున్ నా దగ్గరకు వస్తే, 6నెలల్లోనే ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా చేస్తాను. బ్యాటింగ్‌లో అతని సామర్థ్యం ఎవరికీ తెలియదు. గోవా జట్టుకు ఎంపికకాక ముందు అతడికి 10- 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చాను. అప్పుడే గొప్ప బ్యాటర్ అని గ్రహించాను. ఆ తర్వాత రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. ఎవరైనా ఊహించారా? అర్జున్‌తో బౌలింగ్ చేయించి సమయం వృథా చేస్తున్నారని అనిపించింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా సెట్ అవుతాడు' అని యోగరాజ్ పేర్కొన్నారు.
'క్యాన్సర్‌తో యువీ చనిపోయినా గర్వపడేవాడినే'- యోగ్‌రాజ్ ఎమోషనల్
'కపిల్ దేవ్‌ను కాల్చేద్దామని ఫిక్స్ అయ్యా- పిస్తోల్‌తో వాళ్లింటికి కూడా వెళ్లా'