Bihar Election Results 2025

ETV Bharat / sports

ఒలిపింక్ మెడల్ విన్నర్​పై సస్పెన్షన్ వేటు- ఎందుకంటే?

పారిస్ ఒలింపిక్స్ పతక విజేత అమన్ సెహ్రావత్​పై సస్పెన్షన్ వేటు

Aman Sehrawat Suspended
Aman Sehrawat Suspended (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : October 8, 2025 at 12:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Aman Sehrawat Suspended : పారిస్ ఒలింపిక్స్‌ మెడల్ విన్నర్, భారత స్టార్ అథ్లెట్​ అమన్‌ సెహ్రావత్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అతడిపై ఏడాది సస్పెన్షన్ వేటు పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అతడిపై ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు WFI అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఈ నిర్ణయాన్ని ధ్రువీకరించారు. మరి సమాఖ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అమన్​ను సస్పెండ్ చేయాడానికి కారణం ఏంటంటే?

అయితే అమన్ సెహ్రావత్ బరువు నియంత్రణ, ఫిట్‌నెస్ అంశాల్లో సమాఖ్య నిబంధనలు ఉల్లఘించినట్లు తెలుస్తోంది. అతడు సెప్టెంబర్‌లో క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే 57 కిలోల విభాగం నుంచి అనర్హుడిగా ప్రకటించారు. అనంతరం సెహ్రావత్​సహా అతని కోచింగ్ సిబ్బందికి సమాఖ్య హెచ్చరిక జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘించినందుకు వివరణ కోరింది. అయితే అమన్ ఇచ్చిన వివరణ పట్ల సమాఖ్య సంతృప్తి చెందలేదు. దీంతో అతడిపై వేటు పడింది.

WFI అధ్యక్షుడు ఏమన్నారంటే?
అమన్ నిషేధాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ ధ్రువీకరించారు. "బరువు సంబంధిత నియమాలను ఉల్లంఘించినందుకు ఒలింపిక్ పతక విజేత అమన్ సెహ్రావత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచే ఈ సస్పెన్షన్ అమలులోకి వచ్చింది. అతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించాం" అని సంజయ్ అన్నారు.

సెప్టెంబర్ 14న జరగాల్సిన మ్యాచ్‌కు 18 రోజుల ముందు సెహ్రావత్ క్రొయేషియాలోని పోరెక్‌లో జరిగిన సన్నాహక శిబిరంలో చేరాడట. తగినం సమయం ఉన్నప్పటికీ అతడు నిబంధనల ప్రకారం బరువు, ఫిట్‌నెస్​ను కంట్రోల్​లో ఉంచుకోలేలేదని తెలిసింది.

కెరీర్‌పై ప్రభావం!
సెహ్రావత్‌పై నిషేధం సెప్టెంబర్ 23నే అమల్లోకి వచ్చింది. ఇది సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. ఈ ఒక సంవత్సరం నిషేధం సెహ్రావత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 2026 ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు. 2026 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 03 వరకు రెజ్లింగ్ పోటీలు ఉండనున్నాయి. WFI సస్పెన్షన్ ఎత్తివేయకుంటే, అతడికి ఆసియా క్రీడల్లో పాల్గొనడం దాదాపు కష్టమే!

అప్పుడు కూడా అంతే
గతేడాది పారిస్ ఒలిపింక్స్ పోటీల సందర్భంగా కూడా అమన్ పోటీకి ముందు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నాడు. కాంస్యం పోరులో 57కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్​కు ముందు అమన్ 61.5 కేజీలు ఉన్నాడు. అమన్ బరువుపై శ్రద్ధ తీసుకున్నాడు. పోటీ సమయానికి 57 కేజీలకు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. ఇందు కోసం అతడి కోచింగ్ బృందం తీవ్రంగా కష్టపడింది.

ఏడాదిలో మూడోసారి
ఏడాది కాలంలోనే రెజ్లర్లకు క్రమశిక్షణా ఉల్లంఘన జరగడం ఇది మూడోసారి. గతేడాది పారిస్ ఒలిపింక్స్​ నుంచి ఫిట్‌నెస్ కారణాల వల్ల నినేశ్ ఫొగాట్​పై, 2025 ప్రపంచ అండర్- 20 ఛాంపియన్‌షిప్‌ నుంచి నేహా సంగ్వాన్​పై అనర్హత వేటు పడ్డాయి. ఈ రెండు సంఘటనలపై తీవ్ర వివాదం జరిగింది.

10గంటల్లో 4.6కేజీలు తగ్గిన అమన్- లేకుంటే మళ్లీ అది రిపీట్ అయ్యేదే! - Paris Olympics

ఒలింపిక్స్​లో రెజ్లింగ్ ఖాతాను తెరిచిన అమన్ - కాంస్యాన్ని ముద్దాడిన 21 ఏళ్ల కుర్రాడు​ - Aman Sehrawat Paris Olympics 2024