ETV Bharat / sports

20 ఏళ్ల నాటి ధోనీ రికార్డు సమం - మహి తన చివరి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ ఎప్పుడు ఆడాడంటే? - Duleep Trophy Dhoni

Dhoni Last Duleep Trophy Match : దులీప్​ ట్రోఫీలో 20 ఏళ్ల తర్వాత ధోనీ రికార్డును వికెట్‌ కీపర్‌ జురెల్‌ సమం చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే ఇంతకీ మహీ చివరి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ, ఏ జట్టుపై ఆడాడో తెలుసా?

author img

By ETV Bharat Sports Team

Published : Sep 9, 2024, 9:56 PM IST

source Getty Images
Dhoni Last Duleep Trophy Match (source Getty Images)

Dhoni Last Duleep Trophy Match : 2024 దులీప్ ట్రోఫీలో ఇండియా A వర్సెస్‌ ఇండియా B ప్రారంభ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు సమమైంది. ఇండియా ఏ వికెట్ కీపర్ ధృవ్ జురెల్(23) రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఎనిమిది క్యాచ్‌లు పట్టాడు. దీంతో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు(7) అందుకున్న ఎంఎస్‌ మహీ రికార్డును సమం చేశాడు. 2005లో ధోనీ సాధించిన రికార్డును ఇన్నాళ్లకు మరో వికెట్‌ కీపర్‌ సమం చేయగలిగాడు. మరి మహీ ఈ రికార్డు ఎప్పుడు సాధించాడు? అతడి చివరి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

2005 నుంచి ధోనీ పేరిట రికార్డు - ఎంఎస్‌ ధోనీ 2005 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్​లో ఏడు క్యాచులు అందుకున్న రికార్డు క్రియేట్‌ చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ మ్యాచ్ దులీప్ ట్రోఫీలో ధోనీ చివరి ప్రదర్శన. ఈ మ్యాచ్‌ 2005 ఫిబ్రవరిలో(22-25) నాగ్​పూర్​ వేదికగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ XIతో జరిగింది. ఆ మ్యాచ్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహీ 71 బంతుల్లో 51 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ 170 పరుగులు చేయడంతో ఈస్ట్ జోన్ 454-6 భారీ స్కోరును సాధించింది. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌లలో తక్కువ పరుగుల(వరుసగా 142, 163)కే ఆలౌట్‌ అయింది. ఈ పోరులో మహీ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లతో రికార్డు క్రియేట్‌ చేశాడు.

మొత్తంగా ధోనీ 2004, 2005 ఎడిషన్లలో దులీప్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మహీ దులీప్ ట్రోఫీ తన అరంగేట్ర మ్యాచ్​లో ఇంగ్లాండ్​ Aతో ఆడాడు. ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసిన మహీ, అర్ధ సెంచరీ చేశాడు. ఆ ఎడిషన్‌లో ఈస్ట్ జోన్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో మహీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఫైనల్‌లో అతడు 60 పరుగుల చేసినా, నార్త్ జోన్ చేతిలో జట్టు ఓడిపోయింది.

టెస్టు అరంగేట్రం తర్వాత ఆ మ్యాచ్‌లు తక్కువే?

ఇకపోతే 2005 డిసెంబర్‌లో శ్రీలంకపై మహీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్‌లో కీలక వ్యక్తి అయ్యాడు. కొంత కాలానికే మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకొన్నాడు. అతను టెస్టు అరంగేట్రం తర్వాత కేవలం రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఒకటి 2008లో విక్టోరియాతో, ఆ తర్వాత సంవత్సరంలో ఇరానీ కప్‌లో పాల్గొన్నాడు.

2013లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, 2015లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. దీనికి ముందు, అతను డొమెస్టిక్‌ లిస్ట్-A మ్యాచ్‌ చివరిసారిగా 2007లో ఆడాడు.

ధోనీ పాటు వచ్చారు కానీ మధ్యలోనే వెళ్లిపోయారు - ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరంటే? - Cricketers Debuted With Dhoni

మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్! - అదెలా సాధ్యమైందంటే? - Cricketer Harry Lee Career

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.