Virat Kohli Retirement : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 36ఏళ్లు. ఇప్పుడున్న తన ఫిట్నెస్ ప్రకారం విరాట్ ఈజీగా మరో 2- 3 ఏళ్లు క్రికెట్ ఆడగలడని అందరూ అంచనా వేశారు. కానీ, ఉన్నట్టుండి సోమవారం కోహ్లీ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్‌కు గురి చేశాడు. అయితే విరాట్ నిర్ణయంపై అభిమానలుు సంతృప్తిగా లేరు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు.
వాళ్లకంటే ముందే ఎందుకు?
టీమ్ఇండియా లెజెండ్స్‌గా పిలుచుకునే సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరెంద్ర సెహ్వాగ్‌తో పోలిస్తే, వయసు రీత్యా విరాట్ వాళ్లకంటే ముందుగానే టెస్టుల్లోంచి వైదొలిగాడు. సచిన్, ద్రవిడ్ 39 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించగా, సెహ్వాగ్ 37ఏళ్ల వయసులో తప్పుకున్నాడు. అంతే కాకుండా వీళ్లతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో విరాట్ మార్క్ వేరు.
అథ్లెట్స్‌లో విరాట్ ఫిట్నెస్తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. 17ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఫిట్నెస్లేక విరాట్ జట్టులో స్థానం కోల్పోయిన సందర్భాలు అసలే లేవు. అలాంటి కోహ్లీ ప్రస్తుతం ఉన్న ఫిట్నెస్తో ఇంకొంత కాలం కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడగలడని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
What Thank you? 2 greats retiring one after another, at least farewell match could have been planned.
— Santosh (@Santosh_Focused) May 12, 2025
All this politics from you guys have finally taken away our King from his favourite format.
— Sincere Boy (@sincere_boy_22) May 12, 2025
అంతా వాళ్లే చేశారు?
అయితే విరాట్ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ పెద్దల హస్తం ఉందని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల వల్లే కోహ్లీ కాస్త ముందుగానే టెస్టుల్లోంచి తప్పుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు వ్యవహరించిన తీరు కారణంగానే వైదొలిగాడని మండిపడుతున్నారు. కనీసం ఫేర్వెల్ కూడా లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విరాట్ రిటైర్మెంట్పై బీసీసీఐ షేర్ చేసిన పోస్ట్‌కు కామెంట్లు పెడుతున్నారు.
He still have a lot of Test double hundreds left in him.
— The Day (@TheDayAmazing) May 12, 2025
What could be the possible reason for his retirement.
If this is internal politics in the team, then these decisions are bad for Indian Cricket.
This is not done, BCCI.
— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) May 12, 2025
Virat Kohli deserved a farewell on shoulders at Delhi’s Arun Jaitley Stadium — not like this#ViratKohli pic.twitter.com/V4kauDpRl3
'కొందరి వ్యవహారం వల్లే విరాట్ ఇంత తొందరగా రిటైర్మెంట్ ఇచ్చాడు. బోర్డులో రాజకీయాలు నచ్చకే కింగ్ తప్పుకున్నాడు. అత్యుత్తమ క్రికెటర్ కెరీర్‌ను పాలిటిక్స్ ముగించేశాయి. జాతీయ జట్టుకు ఎన్నో సేవలందించిన లెజెండ్స్ (రోహిత్, విరాట్‌ను ఉద్దేశిస్తూ)కు బోర్డు కనీసం ఫేర్వెల్ కూడా నిర్వహించలేకపోవడం సిగ్గు చేటు. కచ్చితంగా వాళ్లకు ఫేర్వెల్ ఏర్పాటు చేయాల్సిందే' అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Bcci you close 🤡
— Mahatma Gandhi (@gandhijiIND) May 12, 2025
If you want you can stop these 2 retirements 🥺
Shame on BCCI for not sacking coach Gautam Gambhir, a failed test cricketer. Instead, you asked Virat Kohli to retire.
— Khem Raj Thakur (@Raj11_Speaks) May 12, 2025
కాగా, 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విరాట్ 14ఏళ్లు భారత్‌కు ప్రానిధ్యం వహించాడు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు అందించాడు. ఇప్పటికే టీ20 లకూ రిటైర్మెంట్ ఇచ్చేసిన కోహ్లీఇకపై కేవలం వన్డేల్లోనే కొనసాగనున్నాడు.
'కింగ్ కోహ్లీ' బ్రాండ్- ఎన్నో రికార్డులు- మరెన్నో ల్యాండ్ మార్క్ విక్టరీలు!
'కింగ్' కోహ్లీ సంచలన నిర్ణయం- టెస్టులకు గుడ్‌బై చెప్పిన విరాట్