ETV Bharat / sports

'కింగ్ కోహ్లీ' బ్రాండ్​- ఎన్నో రికార్డులు- మరెన్నో ల్యాండ్ మార్క్ విక్టరీలు! - VIRAT KOHLI TEST RECORDS

టెస్ట్ ఫార్మాట్​కు విరాట్ కోహ్లీ రిటైర్​మెంట్​- నమోదైన రికార్డులు ఇవే!

Virat Kohli Test Records
Virat Kohli Test Records (AP)
author img

By ETV Bharat Sports Team

Published : May 12, 2025 at 1:45 PM IST

2 Min Read

Virat Kohli Test Records : ఇంగ్లాండ్ పర్యటనకు ముందుకు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తారని వస్తున్న వార్తలే నిజమయ్యాయి. తాజాగా కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన విరాట్, సుమారు 14 ఏళ్ల పాటు అద్భుతమైన కెరీర్‌ను ఆస్వాదించాడు. అలా తన టెస్ట్​ కెరీర్​లో నమోదైన కోహ్లీ రికార్డులను ఓసారి నెమరవేసుకుందాం.

14 ఏళ్లపాటు భారత్‌ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన విరాట్, తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు (5864) చేశాడు. మొత్తం 30 సెంచరీలు బాదాడు. కాగా, 2025 జనవరి 3వ తేదీన ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.

విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్​
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్​ (SOurce : ETV Bharat)

సక్సెస్ ఫుల్​ టీమ్ఇండియా కెప్టెన్​గా!
టీమ్ ఇండియా తరఫున టెస్ట్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 68 టెస్టులకు నాయకత్వం వహించిన అతడు 58.82 విజయశాతంతో 40 విజయాలు సాధించాడు.

విరాట్ కోహ్లీ రికార్డులు
విరాట్ కోహ్లీ రికార్డులు (SOurce : ETV Bharat)

ల్యాండ్ మార్క్ విజయాలు
కోహ్లీ నాయకత్వంలో టీమ్ ఇండియా విదేశాల్లో ల్యాండ్ మార్క్ విజయాలు సాధించింది. వాటిలో ఫస్ట్ అండ్ బెస్ట్ ఆస్ట్రేలియా సిరీస్ విజయం (2018-2019). ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్​గా రికార్డు సృష్టించారు.

ఏకైక బ్యాటర్ కోహ్లీనే!
టెస్ట్​ల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన టీమ్​ఇండియా ప్లేయర్​గా విరాట్​(7) నిలిచాడు. సచిన్, సెహ్వాగ్​ రికార్డులను బ్రేక్ చేశాడు. వరుసగా నాలుగు టెస్ట్ సిరీసుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ కోహ్లీనే. రాహుల్ ద్రవిడ్, డ్రాన్ బ్రాడ్​మెన్​ను అధగమించాడు.

  • ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్ - 2012, 2015, 2016, 2018, 2023
  • భారత కెప్టెన్ అత్యధిక స్కోరు: 254* vs దక్షిణాఫ్రికా (2019)
  • భారత కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు: 20
  • ఆస్ట్రేలియాలో ఒక టీమ్​ఇండియా ప్లేయర్ సాధించిన అత్యధిక సెంచరీలు: 7
  • కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు: 6
  • బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక ఇండియన్ ప్లేయర్ సంపాదించిన అత్యధిక రేటింగ్ పాయింట్లు: 937 (2018)
  • కెప్టెన్‌గా వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్ విజయాలు: 9

అయితే టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ పది వేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచాడు. కానీ ఇంతలోనే ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు.

'హ్యాపీగా ఉండాలనుకున్నా- అందుకే అలా చేశాను': విరాట్

'గ్రౌండ్​లోకి దిగితే నా ఫోకస్ అంతా దానిపైనే'- విరాట్​ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.